బిజినెస్

నోట్ల రద్దుపై బ్యాంకుల ఆందోళన

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

వడోదర, డిసెంబర్ 20: పాత పెద్ద నోట్ల రద్దు నేపథ్యంలో తాము ఎదుర్కొంటున్న సమస్యలపై అఖిల భారత బ్యాంక్ ఉద్యోగుల సంఘం (ఎఐబిఇఎ), అఖిల భారత బ్యాంక్ అధికారుల సంఘం (ఎఐబిఒఎ) ఆందోళనకు దిగుతున్నాయి. ఈ నెల 28న నిరసన తెలియజేయనున్న సంఘాలు.. 29న కేంద్ర ఆర్థిక శాఖ మంత్రి అరుణ్ జైట్లీకి తమ సమస్యలపై ఓ లేఖను సమర్పించనున్నాయి. జనవరి 2, 3 తేదీల్లోనూ ఆందోళన కార్యక్రమాలను నిర్వహించాలని చూస్తున్నట్లు ఎఐబిఇఎ ప్రధాన కార్యదర్శి సిహెచ్ వెంకటాచలం, ఎఐబిఒఎ ప్రధాన కార్యదర్శి ఎస్ నాగరాజన్ ఓ ప్రకటనలో మంగళవారం తెలిపారు.