బిజినెస్

టాటాలపై మిస్ర్తి న్యాయపోరాటం

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

ముంబయి, డిసెంబర్ 20: మిస్ర్తి-టాటాల వివాదం మరింతగా ముదురుతోంది. సోమవారం స్టాక్ మార్కెట్లలో లిస్టయిన ఆరు టాటా గ్రూప్ సంస్థ బోర్డుల నుంచి తప్పుకున్న సైరస్ మిస్ర్తి.. మంగళవారం టాటా సన్స్‌పై నేషనల్ కంపెనీ లా ట్రిబ్యునల్ (ఎన్‌సిఎల్‌టి)కు వెళ్లారు. సంబంధిత వర్గాల సమాచారం ప్రకారం టాటా సన్స్‌కు వ్యతిరేకంగా మిస్ర్తి కుటుంబ సారథ్యంలోని పెట్టుబడుల సంస్థలు ముంబయిలోని ఎన్‌సిఎల్‌టికి వెళ్లాయి. తనపట్ల టాటా సన్స్ అణచివేత, అన్యాయ వైఖరిని ప్రదర్శించిందంటూ కంపెనీల చట్టంలోని సెక్షన్ 241, సెక్షన్ 242ల క్రింద ఎన్‌సిఎల్‌టిలో దాఖలు చేసిన పిటిషన్‌లో మిస్ర్తి పేర్కొన్నట్లు తెలుస్తోంది. ఈ పిటిషన్‌పై గురువారం ఎన్‌సిఎల్‌టి విచారణ చేపట్టనుందని సదరు వర్గాలు చెబుతున్నాయి. మరోవైపు సైరస్ మిస్ర్తి ఎన్‌సిఎల్‌టిని ఆశ్రయించిన నేపథ్యంలో విచారణను ఎదుర్కొంటామని టాటా సన్స్ స్పష్టం చేసింది. దీనిపై తమ లాయర్లతో సంప్రదిస్తున్నామని పేర్కొంది. కాగా, తనను అన్యాయంగా తొలగించారంటూ టాటాలపై దాదాపు రెండు నెలల నుంచి ఎదురుదాడి చేస్తున్న సైరస్ మిస్ర్తి.. సోమవారం అనూహ్యంగా ఆరు ప్రధాన టాటా గ్రూప్ సంస్థల బోర్డుల నుంచి తప్పుకున్నారు. అయితే రతన్ టాటాపై తన పోరును మాత్రం ఆపబోనని మిస్ర్తి తేల్చిచెప్పారు. పెద్ద వేదికపై న్యాయపోరాటం చేస్తానన్నారు. అన్నట్లుగానే ఎన్‌సిఎల్‌టి గడప తొక్కారు. 100 బిలియన్ డాలర్లకుపైగా విలువైన 100కుపైగా సంస్థలున్న టాటా గ్రూప్‌నకు ప్రాతినిథ్యం వహిస్తున్న టాటా సన్స్ చైర్మన్‌గా మిస్ర్తిపై ఈ ఏడాది అక్టోబర్ 24న టాటాలు వేటు వేసినది తెలిసిందే. ఈ క్రమంలో గ్రూప్‌లోని ఒక్కో సంస్థ బోర్డు నుంచీ మిస్ర్తిని టాటాలు తప్పిస్తున్నారు. ఈ నెలలో ఐదు సంస్థల బోర్డు సమావేశాలు జరగనుండగా, అంతకుముందే ఊహించనివిధంగా స్టాక్ మార్కెట్లలో లిస్టయిన ఆరు సంస్థల నుంచి మిస్ర్తి బయటికొచ్చారు. ఇండియన్ హోటల్స్, టాటా స్టీల్, టాటా మోటార్స్, టాటా పవర్, టాటా కెమికల్స్ తదితర సంస్థల బోర్డులకు మిస్ర్తి టాటా చెప్పేశారు. ప్రస్తుతం టాటా సన్స్ తాత్కాలిక చైర్మన్‌గా రతన్ టాటా కొనసాగుతుండగా, కొత్త చైర్మన్ కోసం అనే్వషణ జరుగుతోంది. మిస్ర్తి చర్యలు టాటా గ్రూప్ నిర్వీర్యానికి దారితీస్తున్నాయని టాటాలు అంటుంటే, అధికారం ఒక్కరి చేతుల్లోనే ఉందంటూ రతన్ టాటాపై మిస్ర్తి విమర్శలు గుప్పిస్తున్నది తెలిసిందే. టాటా సన్స్‌లో మిస్ర్తీ కుటుంబానికి 18.5 శాతం వాటా ఉంది. ఇదిలావుంటే రతన్ టాటా అసత్యవాది అని మిస్ర్తీ అన్నారు. చేయని తప్పుకు నన్ను బలిపశువును చేశారని దుయ్యబట్టారు. 50 సంవత్సరాలుగా టాట సన్స్‌తో తమ కుటుంబం కలిసి నడుస్తోందన్న మిస్ర్తి.. అన్యాయంగా నన్ను తొలగించినందుకే కోర్టులదాకా వెళ్లాల్సి వచ్చిందని చెప్పుకొచ్చారు.