బిజినెస్

ఇక ఇంటి వద్దకే నగదు!

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

న్యూఢిల్లీ, డిసెంబర్ 22: పాత పెద్ద నోట్ల రద్దు నేపథ్యంలో ప్రముఖ ఈ-కామర్స్ సంస్థ స్నాప్‌డీల్.. ఆర్డర్‌పై క్యాష్‌ను అందజేస్తోంది. ‘క్యాష్ బ హోమ్’ సేవలను గురువారం ప్రకటించిన స్నాప్‌డీల్.. కస్టమర్లకు 2,000 రూపాయలను ఇంటికి తెచ్చిస్తోంది. నల్లధనం, నకిలీ కరెన్సీల నిర్మూలన కోసం గత నెల కేంద్రం పాత పెద్ద నోట్ల చలామణిని రద్దు చేసినది తెలిసిందే. నవంబర్ 8వ తేదీ రాత్రి పాత 500, 1,000 రూపాయల నోట్లను రద్దు చేస్తున్నట్లు ప్రధాన మంత్రి నరేంద్ర మోదీ ప్రకటించారు. కొత్తగా 500, 2,000 రూపాయల నోట్లనూ పరిచయం చేస్తున్నట్లు తెలిపారు. ఈ క్రమంలో రద్దయిన నోట్లను ఈ నెల 30 వరకు బ్యాంకులు, పోస్ట్ఫాసుల్లో డిపాజిట్ చేసుకుని, వాటికి సమాన విలువైన కొత్త నోట్లను పొందవచ్చని మోదీ చెప్పారు. అయితే డిమాండ్‌కు తగ్గట్లుగా కొత్త నోట్ల సరఫరా లేకపోవడంతో ప్రజలకు కరెన్సీ కష్టాలు వచ్చిపడ్డాయి. పైగా బ్యాంకులు, ఎటిఎమ్‌లలో నగదు ఉపసంహరణలపై పరిమితి ఉండటంతో ఖాతాదారులు అసౌకర్యానికి గురవుతుండగా, దీన్ని దృష్టిలో పెట్టుకునే స్నాప్‌డీల్ ‘క్యాష్ బ హోమ్’ సర్వీసును పరిచయం చేసింది. రోజువారి అవసరాల నిమిత్తం 2,000 రూపాయలను ఆర్డర్‌పై పొందవచ్చని, ఇందుకు ఇంటివద్దకు వచ్చిన తమ ప్రతినిధి దగ్గరున్న పిఒఎస్ మెషీన్‌లో కస్టమర్లు తమ ఎటిఎమ్ కార్డును స్వైప్ చేయాల్సి ఉంటుందని స్నాప్‌డీల్ తెలిపింది. లావాదేవీ విజయవంతమైతే తమ ప్రతినిధి 2,000 రూపాయలను అందిస్తారని, కస్టమర్లకు ఇచ్చిన ఈ 2,000 రూపాయల నగదును వారి ఖాతాల నుంచి తాము పొందుతామని పేర్కొంది. ఈ సేవలకుగాను కస్టమర్ నుంచి కేవలం ఒక్క రూపాయి మాత్రమే తీసుకుంటామని, బుకింగ్ సమయంలో ఈ కన్వీనియెన్స్ ఫీజును ఫ్రీచార్జ్ లేదా డెబిట్ కార్డు ద్వారా చెల్లించాలంది. ఇదిలావుంటే ఈ సేవలను ఇప్పటికే గుర్గావ్, బెంగళూరుల్లో స్నాప్‌డీల్ అందిస్తోంది. ఈ క్రమంలోనే దేశంలోని మిగతా ప్రధాన నగరాలకూ విస్తరిస్తోంది.