బిజినెస్

‘నా పరువు పోతోంది’

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

ముంబయి, డిసెంబర్ 23: టాటా సన్స్ చైర్మన్‌గా సైరస్ మిస్ర్తికి ఉద్వాసన పలికిన నాటి నుంచి చోటుచేసుకుంటున్న వివాదాలతో తన పరువు పోతోందని రతన్ టాటా అన్నారు. మిస్ర్తి తొలగింపు నేపథ్యంలో టాటా సన్స్ తాత్కాలిక చైర్మన్‌గా రతన్ బాధ్యతలు చేపట్టినది తెలిసిందే. రతన్‌పై మిస్ర్తి తీవ్ర స్థాయిలో విమర్శలు, ఆరోపణలూ చేస్తున్నదీ విదితమే. ఈ క్రమంలోనే శుక్రవారం ఆయన పైవిధంగా ఆవేదన వ్యక్తం చేశారు. టాటా కెమికల్స్ భాగస్వాముల సమావేశంలో తన అభిప్రాయాలను వ్యక్తపరిచారు.
టాటా స్టీల్ చేతికి బిఆర్‌పిఎల్
న్యూఢిల్లీ: ఒడిశాకు చెందిన ఐరన్ ఓర్ పెల్లెట్ తయారీదారు బిఆర్‌పిఎల్‌ను టాటా స్టీల్ సొంతం చేసుకుంది. 900 కోట్ల రూపాయలతో దీన్ని కొనుగోలు చేస్తోంది. ఈ మేరకు ఓ ఒప్పందంపై సంతకాలు జరిగినట్లు శుక్రవారం టాటా స్టీల్ తెలిపింది. అంతా నగదులోనే ఈ లావాదేవీలు జరుగుతున్నాయి. బ్రహ్మణి రివర్ పెల్లెట్స్ లిమిటెడ్ (బిఆర్‌పిఎల్) టర్నోవర్ గత ఆర్థిక సంవత్సరం 2015-16లో 452 కోట్ల రూపాయలుగా నమోదైంది. దీనికి చెందిన రాజస్థాన్‌లోని జైపూర్ ప్లాంట్ వార్షిక సామర్థ్యం 4 మిలియన్ టన్నులైతే, ఒడిశాలోని బర్దిల్ ప్లాంట్ వార్షిక సామర్థ్యం 4.7 మిలియన్ టన్నులు. ఇనుము, ఉక్కు పరిశ్రమ కోసం ఐరన్ ఓర్ పెల్లెట్లను బిఆర్‌పిఎల్ తయారు చేస్తుంది.

చిత్రం..టాటా కెమికల్స్ ఇజిఎమ్‌లో మాట్లాడుతున్న రతన్ టాటా