బిజినెస్

బిస్కట్ పరిశ్రమకు నోట్ల రద్దు సెగ

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

ముంబయి, డిసెంబర్ 25: పాత పెద్ద నోట్ల రద్దు నిర్ణయం బిస్కట్ల అమ్మకాలను ప్రభావితం చేసింది. నోట్ల రద్దు తర్వాత తమ ఉత్పత్తుల విక్రయాలు 1.5 శాతం పడిపోయాయని పార్లే సంస్థ తెలిపింది. నిజానికి నిరుడుతో పోల్చితే ఈ ఏడాది బిస్కట్ల అమ్మకాలు 5 శాతం వృద్ధిరేటును సాధించాయని, అయితే నోట్ల రద్దు నేపథ్యంలో ఈ రెండు (నవంబర్, డిసెంబర్) నెలల్లో అమ్మకాలు బాగా క్షీణించాయని పార్లే ఉత్పత్తుల విభాగం అధిపతి మయాంక్ షా పిటిఐకి తెలిపారు. ప్రస్తుతం మార్కెట్‌లో పార్లే-జి, మోనాకో తదితర బ్రాండ్లను పార్లే విక్రయిస్తోంది. దేశీయ బిస్కట్ మార్కెట్ విలువ 25,000 కోట్ల రూపాయలు.
ఇందులో పార్లే ఉత్పత్తుల వాటా దాదాపు 40 శాతంగా ఉంది. కాగా, నోట్ల రద్దు నేపథ్యంలో వచ్చే ఏడాది గ్రామీణ ప్రాంతాల్లో మార్కెట్ బాగుండొచ్చని షా అంచనా వేశారు. పట్టణ, నగర మార్కెట్లతో పోల్చితే గ్రామాల్లో అమ్మకాలు ఎక్కువగా ఉండొచ్చన్నారు. నోట్ల రద్దుతో కన్జ్యూమర్ గూడ్స్ సంస్థల మార్కెట్ విలువ 1.2 ట్రిలియన్ డాలర్లు ప్రభావితమవగా, అందులో ఎఫ్‌ఎమ్‌సిజి సంస్థల మార్కెట్ విలువే 99,000 కోట్ల రూపాయలుగా ఉంది. ఐటిసి, హెచ్‌యుఎల్ వంటి భారీ సంస్థల ఆదాయాన్ని పాత పెద్ద నోట్ల రద్దు నిర్ణయం తీవ్రంగానే దెబ్బతీసింది. 40-70 శాతం కొనుగోళ్లు పడిపోయాయని మార్కెట్ వర్గాలు అంచనా వేస్తున్నాయి.