బిజినెస్

డిజిటల్ భారత్ మా లక్ష్యం: జైట్లీ

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

న్యూఢిల్లీ, డిసెంబర్ 25: పాత పెద్ద నోట్ల రద్దు నేపథ్యంలో నగదు రహిత లావాదేవీల ప్రచారార్థం రెండు సరికొత్త పథకాలను కేంద్ర ప్రభుత్వం ఆదివారం ప్రారంభించింది. ఈ పథకంలో భాగంగా లక్కీ డ్రాలను కేంద్ర ఆర్థిక శాఖ మంత్రి అరుణ్ జైట్లీ, ఐటి, న్యాయ శాఖ మంత్రి రవిశంకర్ ప్రసాద్‌లు ఇక్కడి విజ్ఞాన్ భవన్‌లో తీశారు. ఈ సందర్భంగా జైట్లీ మాట్లాడుతూ డిజిటలైజేషన్‌తో దేశ ఆర్థిక వ్యవస్థ బలోపేతమవుతుందన్నారు. 100 కోట్ల మొబైల్ ఫోన్లు, 109 కోట్ల ఆధార్ కార్డులున్న భారత్‌కు డిజిటలైజేషన్ లాభదాయకమన్న బిల్‌గేట్స్ మాటలను ఈ సందర్భంగా జైట్లీ ఊటంకించారు. కాగా, షేర్ లావాదేవీల ద్వారా వచ్చే దీర్ఘకాలిక లాభాలపై పన్ను విధించే యోచనేదీ లేదన్నారు. రవిశంకర్ ప్రసాద్ మాట్లాడుతూ డిజిటల్ లావాదేవీలు 300-350 శాతం పెరిగాయన్నారు. ఈ పథకాలు 100 రోజులు అమల్లో ఉంటాయి. ఈ వ్యవధిలో డిజిటల్ పేమెంట్స్ చేసే వినియోగదారులకు, వాటిని అనుమతించే వ్యాపారులకు నగదు బహుమతులు అందనున్నాయి. లక్కీ గ్రాహక్ యోజన కింద ఈ 100 రోజుల్లో రోజుకు 15 వేల మంది వినియోగదారులను లక్కీ డ్రాల ద్వారా ఎంపికచేసి ఒక్కొక్కరికి 1,000 రూపాయలను అందిస్తారు. అలాగే వారానికోసారి జరిగే డ్రాలో ఏడుగురు విజేతలకు గరిష్ఠంగా లక్ష రూపాయలను అందించనున్నారు. ఇక డిజి-్ధన్ వ్యాపార్ యోజన పథకం కింద వారానికి 7వేల మంది వ్యాపారులకు బహుమతులు అందుతాయి. గరిష్ఠంగా ఒక్కొక్కరు 50,000 రూపాయల వరకు పొందే వీలుంది. ఇవేగాక మెగా బహుమతుల కింద కోటి, 50 లక్షలు, 25 లక్షల రూపాయల బహుమతులూ ఉన్నాయి. పాత పెద్ద నోట్ల రద్దు అయిన నవంబర్ 8 నుంచి వచ్చే ఏడాది ఏప్రిల్ 13 మధ్య డిజిటల్ లావాదేవీలు జరిపిన వినియోగదారుల నుంచి విజేతలను ఎంపిక చేస్తారు. వారికే ఏప్రిల్ 14న ఈ మెగా బహుమతులు అందుతాయి. వ్యాపారులకూ 50 లక్షలు, 25 లక్షలు, 5 లక్షల రూపాయల మెగా బహుమతులను ఇవ్వనున్నారు. కాగా, 50 రూపాయల నుంచి 3,000 రూపాయల మధ్య జరిగిన డిజిటల్ పేమెంట్లకే ఈ పథకాలు వర్తిస్తాయి. ఈ రెండు పథకాల కోసం 340 కోట్ల రూపాయలను కేంద్ర ప్రభుత్వం వెచ్చిస్తోంది.

చిత్రాలు..డిజి ధన్ మేళా ప్రారంభోత్సవంలో మాట్లాడుతున్న కేంద్ర ఆర్థిక మంత్రి అరుణ్ జైట్లీ. పక్కన లక్కీ డ్రాలు తీస్తున్న జైట్లీ, రవిశంకర్ ప్రసాద్‌లు