బిజినెస్

ఒఎన్‌జిసి చేతికి జిఎస్‌పిసి వాటా

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

న్యూఢిల్లీ, డిసెంబర్ 25: ప్రభుత్వరంగ చమురు, సహజవాయువు ఉత్పాదక దిగ్గజం ఒఎన్‌జిసి.. కృష్ణా-గోదావరి (కెజి) బేసిన్‌లోని గుజరాత్ స్టేట్ పెట్రోలియం కార్పొరేషన్ (జిఎస్‌పిసి) వాటా కొనుగోలుకు 1.2 బిలియన్ డాలర్లకుపైగా వెచ్చిస్తోంది. కెజి బేసిన్‌లో జిఎస్‌పిసికి 80 శాతం వాటా ఉంది. అయితే దాదాపు రెండున్నరేళ్లుగా ఇక్కడ వాణిజ్య ఉత్పత్తిని చేయలేకపోతోంది జిఎస్‌పిసి. ఈ క్రమంలోనే మొత్తం వాటాను అమ్మేసింది. మూడు క్షేత్రాలకు ఒక బిలియన్ డాలర్లను ఇవ్వనున్న ఒఎన్‌జిసి.. మిగతా ఆరు క్షేత్రాలకు అడ్వాన్స్ కన్సిడరేషన్‌గా మరో 200 మిలియన్ డాలర్లను అందించనుంది. కాగా, జిఎస్‌పిసి రుణ భారం నిరుడు మార్చి 31 నాటికి 19,716.27 కోట్ల రూపాయలుగా ఉంది.