బిజినెస్

కోరుకున్న సీటు కావాలంటే.. అదనపు చార్జీ!

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

న్యూఢిల్లీ, డిసెంబర్ 25: దేశీయ విమానాల్లో ప్రయాణికులు తమకు ఇష్టమైన సీటు కావాలంటే.. ఉదాహరణకు కాళ్లుజాపుకోవడానికి ఎక్కువ స్థలం ఉండే సీటు లేదా విండోసైడ్ సీటు కావాలనుకుంటే టికెట్ చార్జీతోపాటుగా మరికాస్త ఎక్కువ చెల్లించాల్సిందే. చివరికి మధ్య సీటు కావాలన్నా అదే పరిస్థితి. తీవ్రమైన పోటీ కారణంగా చార్జీలు పెంచడం మాట అటుంచి పలు రాయితీలు ప్రకటించాల్సి వస్తుండడంతో విమానయాన సంస్థలు అదనపు రాబడి మార్గాలను వెతుక్కుంటున్న నేపథ్యంలో వాటికి ఇదొక మార్గంగా మారింది. దేశీయ విమానయాన సంస్థలు అందించే వివిధ సేవలను వేరు చేయడానికి నిబంధనలు సైతం అనుమతిస్తూ ఉండడంతో విమానయాన సంస్థలు విమానాల్లో ప్రయాణికులు తమకిష్టమైన సీటు కావాలనుకుంటే అదనపు చార్జీ వసూలు చేస్తున్నాయి. అయితే అంతర్జాతీయ విమాన సర్వీసుల్లో ఇదంతా సర్వసాధారణం కాబట్టి ఇదేమీ కొత్తగా ప్రవేశపెట్టిన సంప్రదాయం ఏమీ కాదని, అంతేకాక అదనంగా ఆదాయాన్ని సైతం ఇస్తుందని విమానయాన నిపుణులు అంటున్నారు.
సాధారణంగా విమానాల్లో ప్రయాణించే వారు ఎక్కువగా విండో సీటు, అలాగే కాళ్లు జాపుకోవడానికి ఎక్కువ చోటు ఉండే సీట్లను కోరుకుంటుంటారు. అతిథులు ముందుగా సీటు రిజర్వ్ చేసుకోనే సంప్రదాయం ఇప్పటికే ఉందని, పూర్తిస్థాయి, అలాగే లోకాస్ట్ ఎయిర్‌లైన్స్‌తో పాటుగా ప్రపంచవ్యాప్తంగా దాదాపుగా అన్ని ప్రధాన ఎయిర్‌లైన్స్‌లోను అమలులో ఉందని జెట్ ఎయిర్‌వేస్‌కు చెందిన ప్రతినిధి ఒకరు చెప్పారు.
భారత దేశంలో కూడా ఈ సంప్రదాయాన్ని పాటించడం జరుగుతోందని, డిజిసిఏ గైడ్‌లైన్స్ ప్రకారం అనుబంధ ఆదాయాల్లో ఇదొక భాగమని ప్రాధాన్యతా సీట్లకు అదనపు చార్జీ వసూలు చేయడం గురించి పిటిఐ అడిగిన ప్రశ్నలకు సమాధానంగా ఆ ప్రతినిధి తెలియజేశారు. తమ ఎయిర్‌లైన్స్‌లో మిడిల్ సీట్లకు సంబంధించి డొమెస్టిక్ ఎకానమీ క్యాబిన్‌లోని ముందువైపు ఏడు వరస సీట్లను మాత్రమే అదనపు చార్జి చెల్లించి ముందుగా రిజర్వ్ చేసుకోవచ్చని, మిగతా 19 వరసల్లోని మిడిల్ సీట్లను ఉచితంగానే ముందుగా రిజర్వ్ చేసుకోవచ్చని ఆ ప్రతినిధి చెప్పారు.
గత రెండేళ్లుగా దేశీయ విమానయాన రంగంలో ప్రయాణికుల సంఖ్య 20 శాతం చొప్పున పెరుగుతున్నారు. అయితే తీవ్రమైన పోటీ ఉన్న కారణంగా ఈ విమానాల్లో చార్జీలు మాత్రం తక్కువగా ఉంటున్నాయి. ఈ నేపథ్యంలో విమానయాన సంస్థలు అదనపు రాబడికి మార్గాలను అనే్వషించుకోవలసి వస్తోంది. కాగా, ఆన్‌లైన్ బుకింగ్ సమయంలో కానీ లేదా వెబ్ చెక్ సమయంలో కానీ ప్రయాణికుడు తమకు ఇష్టమైన సీటును ఎంపిక చేసుకోవచ్చని, అయితే ‘ముందు వచ్చినవారికి ముందుగా’ ప్రాతిపదికన సీట్లను కేటాయించడం జరుగుతుందని స్పైస్ జెట్ ప్రతినిధి చెప్పారు.