బిజినెస్

కోడిపందాలు.. ఇక ఆన్‌లైన్ కూత!

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

భీమవరం, డిసెంబర్ 26: ‘శతకోటి దరిద్రాలకు అనంత కోటి ఉపాయాలు’ అన్న నానుడి సంక్రాంతి కోడిపందాలకు అతికినట్టు సరిపోతుంది. సంక్రాంతి మూడు రోజులు సంప్రదాయం ముసుగులో కోడి పందాలు, ఇతర జూదాల జాతర సాగే విషయం తెలిసిందే. ఏటా కోట్ల రూపాయలు ఈ పందాల్లో చేతులు మారుతుంటాయి. అయితే ఈ ఏడాది కరెన్సీ సంక్షోభం కారణంగా పందాల జోరు తగ్గుతుందని అంతా భావిస్తున్నారు. పెద్ద పెద్ద పందాల రాయుళ్లతోపాటు, సామాన్య, మధ్యతరగతి ప్రజలు సైతం ఎంతోకొంత పందాల్లో ఒడ్డడం ఇక్కడ రివాజు. కానీ పాత పెద్ద నోట్ల రద్దు కారణంగా చేతిలో నగదు లభ్యత తగ్గిపోవడంతో పందాల నిర్వాహకులు చకచకా వ్యూహాలు మార్చేస్తున్నారు. ఓ వైపు హైకోర్టు వద్దంటున్నా, మరోవైపు ‘నగదు రహిత లావాదేవీలు’ పేరిట ప్రభుత్వం చేస్తున్న ప్రచారాన్ని తమకు అనుకూలంగా మలచుకునే ప్రయత్నాలు మొదలయ్యాయి. పందాల బరుల వద్ద ప్రత్యేకంగా స్వైపింగ్ మిషన్లు ఏర్పాటుకు రంగం సిద్ధమవుతోంది. ముఖ్యంగా పశ్చిమ గోదావరి జిల్లాలో భీమవరం, అయిభీమవరం, వెంప, జంగారెడ్డిగూడెం, యలమంచిలి, చింతలపూడి తదితర ప్రాంతాల్లో ఏర్పాటయ్యే పందాలు రాష్టవ్య్రాప్తంగానేగాక అమెరికా వంటి దేశాల్లోనూ ప్రసిద్ధి. ఈ పందాల వద్దకు పలువురు ఎన్నారైలు సైతం విచ్చేస్తుంటారు. దీంతో ఈ ప్రాంతాల్లోని బరుల వద్ద ఈ తరహా ప్రత్యేక ఏర్పాట్లు జరుగుతున్నట్టు సమాచారం. ఇందుకోసం తాత్కాలికంగా బ్యాంకు ఖాతాలు తెరిచే ప్రయత్నాల్లో ఉన్నారు. అయితే ఈ సమాచారం పందాలరాయుళ్లకు అందించడానికి సామాజిక మాధ్యమాల్లో ప్రచారం చేస్తున్నారు. ఇపాస్ యంత్రం, కోడిపుంజు బొమ్మతో చేస్తున్న ఈ ప్రచారం ప్రస్తుతం సామాజిక మాధ్యమాల్లో హల్‌చల్ చేస్తోంది. అయితే డిసెంబర్ 30 తర్వాత బ్యాంకుల నుండి నగదు విత్‌డ్రా పరిమితి పెంచుతారని, అదే జరిగితే పందాల సమయానికి నగదు కొరత తగ్గవచ్చని పందాలరాయుళ్లు భావిస్తున్నారు. దీంతో కేంద్ర ప్రభుత్వ ప్రకటన కోసం పలువులు పందాల రాయుళ్లు ఆశగా ఎదురుచూస్తున్నారు.
జోరుగా పందెం పుంజుల విక్రయాలు
ఇదిలావుంటే పందెం పుంజుల విక్రయాలు జోరుగా సాగుతున్నాయి. పెంపకందార్లు భీమవరం సమీప గ్రామాల్లో పెద్ద పెద్ద గుడారాలు ఏర్పాటుచేసి అమ్మకాలను ప్రారంభించారు. పందెం బరిలో నిలిచే పుంజుల ధర 25 వేల రూపాయల నుంచి పలుకుతోంది. ఇప్పటికే చాలా పుంజులు విక్రయించేశామని, కొన్ని పుంజులను మాత్రం పండుగకు వచ్చే ఎన్‌ఆర్‌ఐ, పారిశ్రామికవేత్తల కోసం దాచి ఉంచుతున్నామని ఒక వ్యాపారి తెలిపారు.
గ్రామాల్లో ప్రారంభమైన డింకీ పందాలు
గోదావరి జిల్లాలో ఇప్పటికే కోళ్లకు కత్తులు లేకుండా నిర్వహించే డింకీ పందాలను రహస్యంగా ప్రారంభించేశారు. ఎంపిక చేసుకున్న కొన్ని ప్రాంతాల్లో ఈ పందాలు జరుగుతున్నాయి. ఈ విధమైన పందాలపై సమాచారం అందుకున్న పోలీసులు దాడులు సైతం చేస్తున్నారు.

చిత్రం..భీమవరం ప్రాంతంలో పందెం పుంజుల విక్రయశాల