బిజినెస్

స్మార్ట్ఫోన్లు, కంప్యూటర్ అమ్మకాలపై తగ్గనున్న పన్ను!

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

కర్నూలు, డిసెంబర్ 27: డిజిటల్ లావాదేవీలను ప్రోత్సహించేందుకు స్మార్ట్ఫోన్లు, కంప్యూటర్లపై ప్రస్తుతం విధిస్తున్న పన్నును తగ్గించే యోచనలో రాష్ట్ర ప్రభుత్వం ఉన్నట్లు తెలుస్తోంది. ల్యాప్‌టాప్, డెస్క్‌టాప్, స్మార్ట్ఫోన్లపై ప్రస్తుతం విధిస్తున్న పన్నుల్లో 9 నుంచి 10 శాతం తగ్గించాలని ఏపి ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు ఆలోచిస్తున్నట్లు అధికార వర్గాల ద్వారా తెలుస్తోంది. అయతే దీనివల్ల రాష్ట్ర ప్రభుత్వంపై పడే భారం ఎంత? అన్న లెక్కలు తేలుస్తున్నారు. ఆ తరువాత ప్రభుత్వం తుది నిర్ణయం తీసుకునే అవకాశాలు ఉన్నాయి. దేశంలో పాత పెద్ద నోట్ల రద్దు తరువాత డిజిటల్ లావాదేవీలను ప్రోత్సహించేందుకు కేంద్రం ఇప్పటికే పలు కీలక నిర్ణయాలు తీసుకున్న విషయం తెలిసిందే. మరిన్ని నిర్ణయాలనూ తీసుకునే దిశగా వెళ్తోంది. బ్యాంకుల ద్వారా నిర్వహించే నగదు రహిత లావాదేవీలపై బ్యాంకర్లు వేసే చార్జీలను ఎత్తివేసిన కేంద్రం.. నగదు రహిత కొనుగోళ్లు చేసిన వ్యక్తులకు బహుమతులను ప్రకటించింది. మరోవైపు కేంద్ర ప్రభుత్వం కూడా స్మార్ట్ఫోన్లు, కంప్యూటర్లపై ప్రస్తుతం దిగుమతి సుంకం విధిస్తుండగా, దీన్ని తగ్గించడం లేదంటే పూర్తిగా ఎత్తివేయడం వంటి చర్యలు తీసుకునే అవకాశముందని అధికారుల ద్వారా తెలుస్తోంది. అంతేగాక నగదు రహిత లావాదేవీలను నిర్వహించేందుకు ముందుకు వస్తున్న పలు సంస్థలకు ప్రభుత్వం నుంచి ప్రోత్సాహాన్ని అందించాలన్న ఉద్దేశ్యంతో ప్రస్తుతం చర్చలు సాగుతున్నాయని అధికారులు పేర్కొంటున్నారు.
మరోవైపు స్మార్ట్ఫోన్లు, కంప్యూటర్ల అమ్మకాలపై పన్ను రాయితీతో భారీ ఎత్తున నగదు రహిత లావాదేవీలు పెరిగి కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాలకు పన్నుల రూపంలో అత్యధిక లబ్ది చేకూరుతుందని అధికారులు పేర్కొంటున్నారు. దీని కారణంగా ఇప్పుడు పన్నులు తగ్గిస్తే వచ్చే నష్టం, నగదు రహిత లావాదేవీల కారణంగా పెరిగే పన్ను ఆదాయంపై పూర్తి స్థాయిలో లెక్కలు వేస్తున్నారు. వీలైనంత త్వరలో పన్నుల తగ్గింపుపై తుది నిర్ణయం వెలువడవచ్చని అధికారులు ఆశాభావం వ్యక్తం చేస్తున్నారు.