బిజినెస్

కొత్తగూడెంలో మైనింగ్ యూనివర్సీటీ

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

కొత్తగూడెం, డిసెంబర్ 27: కొత్తగూడెంలో మైనింగ్ యూనివర్సీటీ ఏర్పాటు చేయడానికి పూర్తిస్థాయిలో ఏర్పాట్లు జరుగుతున్నాయని తెలంగాణ రాష్ట్ర ఉన్నత విద్యా పాలకమండలి చైర్మన్ ప్రొఫెసర్ పాపిరెడ్డి అన్నారు. ఇనిస్టిట్యూషన్ ఆఫ్ ఇంజనీర్స్ ఆధ్వర్యంలో మైనింగ్ పరిశ్రమ భవిష్యత్ అవసరాలపై హైదరాబాద్‌లోని విశే్వశ్వరయ్య భవన్‌లో సోమవారం రాత్రి సదస్సు నిర్వహించారు. ఈ కార్యక్రమంలో ఆయన మాట్లాడుతూ మైనింగ్ విద్యకు సంబంధించిన పాఠ్యాంశాలు వాటిలో చేయవల్సిన మార్పులపై సదస్సులో కీలక నిర్ణయం తీసుకున్నట్లు తెలిపారు. సింగరేణి కాలరీస్ డైరెక్టర్ ఆపరేషన్ బి రమేష్‌కుమార్ మాట్లాడుతూ సింగరేణి యాజమాన్యం ప్రతి ఏడాది మైనింగ్ గ్రాడ్యూయేట్లను నియమించే అవకాశముందన్నారు. భవిష్యత్ మైనింగ్ అవసరాలను దృష్టిలో పెట్టుకొని మైనింగ్ విద్యార్థులు నైపుణ్యాన్ని పెంపొందించుకోవాలన్నారు. మైనింగ్ పాఠ్యాంశాలను అవసరాలకు అనుగుణంగా రూపొందించుకోవాలని కోరారు. 12 అంశాలపై తీర్మానాలు కూడా చేశారు. ఈ ముగింపు కార్యక్రమానికి తెలంగాణ విద్యాశాఖ సంయుక్త కార్యదర్శి టి విజయ్‌కుమార్, ఎన్‌ఎండిసి పూర్వ సిఅండ్‌ఎండి రమేష్‌కుమార్, ఎపి ఎస్పి పూర్వచైర్మన్ చంద్రమోహన్, కొత్తగూడెం ఏరియా జనరల్ మేనేజర్ రమణమూర్తి తదితరులు పాల్గొన్నారు.

చిత్రం..మైనింగ్ పరిశ్రమ భవిష్యత్ అవసరాలపై జరిగిన సదస్సులో పాపిరెడ్డి (ఎడమ నుంచి మూడో వ్యక్తి)