బిజినెస్

సైరస్ మిస్ర్తికి టాటా సన్స్ లీగల్ నోటీసు

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

న్యూఢిల్లీ, డిసెంబర్ 27: టాటా సన్స్.. తమ మాజీ చైర్మన్ సైరస్ మిస్ర్తికి లీగల్ నోటీసును ఇచ్చింది. సంస్థకు సంబంధించిన రహస్య, విశ్వసనీయ సమాచారాన్ని బహీర్గతం చేస్తూ సంస్థను నిర్వీర్యపరుస్తున్నారంటూ ఈ లీగల్ నోటీసును మంగళవారం ఇచ్చింది. జరిగిన బోర్డు సమావేశాలు, ఆర్థికపరమైన సమాచారాన్ని, ఇతరత్రా కీలకమైన డేటాను, విలువైన డాక్యుమెంట్లను మిస్ర్తి బయటకు తెలియపరుస్తున్నారంటూ ఆక్షేపించింది. టాటా సన్స్ చైర్మన్‌గా ఈ ఏడాది అక్టోబర్ 24న మిస్ర్తి ఉద్వాసనకు గురైనది తెలిసిందే. 103 బిలియన్ డాలర్లకుపైగా విలువైన 100కుపైగా సంస్థలున్న టాటా గ్రూప్‌లోని ఒక్కో సంస్థ నుంచీ మిస్ర్తిని తొలగిస్తుండగా, మిస్ర్తిని అన్యాయంగా తొలగించారంటూ ఆయన కుటుంబానికి చెందిన సంస్థలు నేషనల్ కంపెనీ లా ట్రిబ్యునల్ (ఎన్‌సిఎల్‌టి)ను ఆశ్రయించాయి. ఈ క్రమంలోనే ఆయా సంస్థలు టాటా సన్స్‌కు చెందిన అతి ముఖ్యమైన, రహస్యమైన సమాచారాన్ని తమ పిటిషన్‌లో పేర్కొన్నారని టాటా సన్స్ ఆగ్రహం వ్యక్తం చేస్తోంది. ఇదిలావుంటే టాటా గ్రూప్‌లోని ఆటోరంగ సంస్థ టాటా మోటార్స్ వాణిజ్య వాహనాల ప్రచారం కోసం నూతన బ్రాండ్ అంబాసిడర్‌గా బాలీవుడ్ యాక్షన్ హీరో అక్షయ్ కుమార్ ఎన్నికయ్యారు. వచ్చే నెల నుంచి ఈయన టాటా మోటార్స్ వాణిజ్య వాహనాల ప్రకటనలో కనిపిస్తారు. ఈ మేరకు అక్షయ్ కుమార్‌తో టాటా మంగళవారం ఒప్పందం చేసుకుంది.