బిజినెస్

శక్తివంచన లేకుండా పనిచేస్తా : ఆచార్య

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

న్యూఢిల్లీ, డిసెంబర్ 29: కొత్త బాధ్యతలను సమర్థవంతంగా నిర్వర్తించేందుకు శక్తివంచన లేకుండా ప్రయత్నిస్తానని రిజర్వు బ్యాంకు నూతన డిప్యుటీ గవర్నర్‌గా నియమితులైన ప్రముఖ ఆర్థికవేత్త విరల్ ఆచార్య స్పష్టం చేశారు. ఆర్‌బిఐ డిప్యుటీ గవర్నర్‌గా తనకు అవకాశం కల్పించడాన్ని గొప్ప గౌరవంగా భావిస్తున్నానని, ఈ బాధ్యతలను సమర్ధవంతంగా నిర్వర్తించేందుకు కృషి చేస్తానని ఆయన గురువారం పిటిఐ వార్తా సంస్థకు తెలిపారు. రిజర్వు బ్యాంకు కొత్త డిప్యుటీ గవర్నర్‌గా బుధవారం నియమితుడైన ఆచార్య జనవరి 20వ తేదీన బాధ్యతలు స్వీకరిస్తారని, మూడేళ్ల పాటు ఆయన ఈ పదవిలో కొనసాగుతారని ఆర్‌బిఐ బుధవారం రాత్రి ఒక ప్రకటనలో వెల్లడించింది. ఇంతకుముందు రిజర్వు బ్యాంకు డిప్యుటీ గవర్నర్లలో ఒకరైన ఉర్జిత్ పటేల్‌ను ప్రభుత్వం ఆర్‌బిఐ గవర్నర్‌గా నియమించడంతో ఆ పదవి ఖాళీ అయిన విషయం తెలిసిందే. దీంతో ఆ పదవిలో నియమితులైన ఆచార్య రిజర్వు బ్యాంకు ద్రవ్య విధానంతో పాటు రీసెర్చ్ క్లస్టర్‌ను పరిశీలించనున్నారు. ప్రస్తుతం ఆచార్యతో పాటు ఎస్‌ఎస్.ముంద్రా, ఎన్‌ఎస్.విశ్వనాథన్, ఆర్.గాంధీ రిజర్వు బ్యాంకు డిప్యుటీ గవర్నర్లుగా కొనసాగనున్నారు. ప్రస్తుతం అమెరికాలోని న్యూయార్క్ యూనివర్శిటీ (ఎన్‌వైయు)కి చెందిన స్టెర్న్ స్కూల్ ఆఫ్ బిజినెస్ ఆర్థిక శాస్త్ర విభాగంలో ఎకనమిక్స్ ప్రొఫెసర్‌గా పనిచేస్తున్న ఆచార్య ఎన్‌వైయు స్టెర్న్ స్కూల్ ఆఫ్ బిజినెస్ నుంచి అర్థశాస్త్రంలో పిహెచ్‌డి పట్టాను పొందారు.

చిత్రం..ఆర్‌బిఐ కొత్త డిప్యుటీ గవర్నర్‌గా నియమితులైన విరల్ ఆచార్య