బిజినెస్

బ్యాంకుల్లో కుమ్మరించినంత మాత్రాన నల్లధనం తెల్లగా మారదు!

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

న్యూఢిల్లీ, డిసెంబర్ 29: సరైన పద్ధతులు పాటించకుండా బ్యాంకుల్లో సొమ్మును డిపాజిట్ చేసినంత మాత్రాన నల్లధనం తెల్లగా మారబోదని కేంద్ర ప్రభుత్వం మరోసారి తీవ్రంగా హెచ్చరించింది. పెద్ద నోట్ల రద్దు అనంతరం బ్యాంకుల్లో దాదాపు 60 లక్షల మంది వ్యక్తులు, సంస్థలు సుమారు 7 లక్షల కోట్ల రూపాయలు డిపాజిట్లు చేసినట్లు పక్కా సమాచారం అందడంతో కేంద్ర ప్రభుత్వం గురువారం ఈ విషయాన్ని స్పష్టం చేసింది. నిజమైన డిపాజిట్‌దారులెవరినీ ప్రభుత్వం ఇబ్బంది పెట్టబోదని, అయితే అక్రమ సంపాదనను తెల్లధనంగా మార్చుకునేందుకు ప్రయత్నించే నల్లకుబేరులను పట్టుకుని వారిపై కఠినమైన చర్యలు చేపట్టేందుకు ప్రభుత్వం ఏమాత్రం వెనుకంజ వేయబోదని ఉన్నతాధికారులు తెలిపారు. పెద్ద నోట్ల రద్దు అనంతరం ప్రభుత్వం అప్రకటిత సొమ్మును కూడబెట్టిన వారికి ప్రధాన మంత్రి గరీబ్ కల్యాణ్ యోజన (పిఎంజికెవై) పేరుతో పన్ను ఎగవేత క్షమాదాన పథకాన్ని అందుబాటులోకి తీసుకొచ్చిందని, ఈ పథకం కింద పన్ను బకాయిలను చెల్లించి దోష విముక్తులు కాకపోతే వారు ప్రభుత్వం చేతుల నుంచి ఎట్టిపరిస్థితుల్లోనూ తప్పించుకోలేరని ఆ అధికారులు స్పష్టం చేశారు. ‘తాము కూడబెట్టిన అప్రకటిత సొమ్ము ఇప్పుడు బ్యాంకింగ్ వ్యవస్థలోకి వచ్చినందున అదంతా తెల్లధనంగా మారుతుందని కొంత మంది భావిస్తున్నారు. ఆ భావన సరైంది కాదు. పెద్ద నోట్ల రద్దు తర్వాత బ్యాంకుల్లో 2 లక్షల నుంచి 5 లక్షల రూపాయల కంటే ఎక్కువ సొమ్మును డిపాజిట్ చేసిన వారందని వివరాలను రోజువారీగా ఎప్పటికప్పుడు సేకరిస్తున్నాం. సరైన పద్దతులు పాటించకుండా బ్యాంకుల్లో అధిక మొత్తాలను డిపాజిట్ చేసిన వారందరినీ పన్నుల పరిధిలోకి తీసుకురావడం ఖాయం. కనుక ఈ విషయాన్ని స్వయంగా వారే అర్థం చేసుకుని పిఎంజికెవై పథకాన్ని ఉపయోగించుకోవడం ద్వారా పన్ను బకాయిలు చెల్లిస్తే సరే సరి. లేకపోతే వారికి కష్టాలు తప్పవు. ఎట్టిపరిస్థితుల్లోనూ వారు ప్రభుత్వం కళ్లు గప్పి తప్పించుకోలేరు’ అని కేంద్ర ప్రభుత్వ ఉన్నతాధికారి ఒకరు పిటిఐ వార్తా సంస్థకు వివరించారు. వేర్వేరు బ్యాంకుల్లో అనేక ఖాతాలను కలిగివున్న వ్యక్తులతో పాటు ఇతరుల బ్యాంకు ఖాతాల్లో సొమ్మును డిపాజిట్ చేస్తూ పన్నులు ఎగ్గొట్టే వారి వివరాలను తెలుసుకునే శక్తి సామర్ధ్యాలు ఆదాయ పన్ను విభాగానికి ఉన్నాయన్న విషయాన్ని ఎవరూ మరువరాదని ఆ అధికారి ఈ సందర్భంగా స్పష్టం చేశారు.