బిజినెస్

త్వరలో భోగాపురం ఎయిర్‌పోర్టు పనులు

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

విజయనగరం, జనవరి 1: భోగాపురం అంతర్జాతీయ విమానాశ్రయం పనులు ఈ ఏడాది ప్రారంభమవుతాయని కేంద్ర పౌర విమానయాన శాఖ మంత్రి పి అశోక్ గజపతిరాజు వెల్లడించారు. ఆదివారం ఇక్కడి అశోక్ బంగ్లాలో తనను కలసిన విలేఖరులతో ఆయన మాట్లాడారు. భోగాపురం విమానాశ్రయానికి సంబంధించి దాదాపు భూసేకరణ పూర్తయ్యిందని, రైతులు స్వచ్ఛందంగా ముందుకు వచ్చి భూములు ఇవ్వడం ఆనందదాయకమని, ఇంకా భూసేకరణకు 300 ఎకరాలు మాత్రమే ఉందని చెప్పారు. కాగా, ప్రపంచంలో అతివేగంగా విస్తరిస్తున్న రంగాల్లో విమానయాన రంగం ఒకటిగా ఉందన్నారు. ఈ రంగంలో కూడా ఉపాధి అవకాశాలు ఎక్కువగా ఉన్నాయని, వంద ఉద్యోగాలు కల్పించగలిగితే అనుబంధ రంగాల్లో 600 ఉద్యోగాలు లభించే అవకాశాలు ఉన్నాయని పేర్కొన్నారు.