బిజినెస్

పేటిఎమ్‌కు పేమెంట్స్ బ్యాంక్ లైసెన్సు

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

న్యూఢిల్లీ, జనవరి 3: పేమెంట్స్ బ్యాంక్ లైసెన్సును అందుకున్నట్లు పేటిఎమ్ మంగళవారం తెలిపింది. రిజర్వ్ బ్యాంక్ ఆఫ్ ఇండియా (ఆర్‌బిఐ) మంజూరు చేసినట్లు చెప్పింది. వచ్చే నెల నుంచి పేమెంట్స్ బ్యాంక్ కార్యకలాపాలు మొదలు కావచ్చని వివరించింది. వ్యక్తిగతంగా, చిన్నతరహా వ్యాపారుల నుంచి ఒక్కో ఖాతాకు లక్ష రూపాయల వరకు పేమెంట్స్ బ్యాంకులు డిపాజిట్లు సేకరించవచ్చు. ‘ఈరోజే ఆర్‌బిఐ నుంచి పేమెంట్స్ బ్యాంక్ ఏర్పాటుకు అవసరమైన అనుమతి వచ్చింది. ఇక ఏమాత్రం తాము ఆలస్యం చేయబోం. వీలైనంత త్వరగా పేమెంట్స్ బ్యాంక్‌ను ఏర్పాటు చేస్తాం.’ అని వన్97 కమ్యూనికేషన్స్ వ్యవస్థాపకుడు విజయ్ శేఖర్ శర్మ మంగళవారం తెలిపారు. కాగా, ఉత్తరప్రదేశ్‌లోని నోయిడాలో తొలి బ్రాంచ్‌ను పేటిఎమ్ ఏర్పాటుచేయవచ్చని సంస్థ ప్రతినిధి చెప్పారు. మొత్తం 11 సంస్థలకు ఆర్‌బిఐ.. పేమెంట్స్ బ్యాంక్ లైసెన్సులను ఇవ్వగా, అందులో టెక్ మహీంద్ర, చోళమండలమ్ ఇనె్వస్ట్‌మెంట్ అండ్ ఫైనాన్స్ కంపెనీ, దిలీప్ సంఘ్వీ నేతృత్వంలోని మరో సంస్థ లైసెన్సులను వెనక్కిచ్చేశాయి. ఎయిర్‌టెల్ మాత్రమే ఇప్పటివరకు ఇందులో పేమెంట్స్ బ్యాంక్ సేవలను మొదలుపెట్టింది. ఈ ఏడాది జూన్‌లోగా ఆదిత్యా బిర్లా నేతృత్వంలోని ఐడియా సంస్థ పేమెంట్స్ బ్యాంక్ సేవలను ప్రారంభించే వీలుండగా, ఇప్పుడు పేటిఎమ్ ఆ సేవలను ఆరంభించాలని తీవ్రంగా ప్రయత్నిస్తోంది.