బిజినెస్

డిజిటల్ విద్యకు శ్యాంసంగ్ క్లాస్‌లు

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

హైదరాబాద్, జనవరి 5: చిన్నతనం నుంచే డిజిటల్ అక్షరాస్యత మెరుగుపరచాల్సిన ఆవశ్యకతను గుర్తించిన శ్యాంసంగ్ ఇండియా గురువారం తమ ఫ్లాగ్ షిప్ కార్యక్రమం శాంసంగ్ స్మార్ట్ క్లాస్‌ను జవహర్ నవోదయ విద్యాలయం గచ్చిబౌలిలో ప్రదర్శించింది. ప్రతి శాంసంగ్ స్మార్ట్ క్లాసులో ఇంటరాక్టివ్ శాంసంగ్ స్మార్ట్‌బోర్డు ల్యాప్‌టాప్స్, టాబ్లెట్, ప్రింటర్, వైఫై కనెక్టివిటీ, పవర్ బ్యాకప్ ఉంటాయి. ఈ సందర్భంగా శాంసంగ్ ఇండియా సామాజిక బాధ్యత అధిపత దీపక్ భరద్వాజ్ మాట్లాడుతూ రెండు లక్షల మంది విద్యార్ధులకు డిజిటల్ అక్షరాస్యతను సాధించేందుకు తమ కార్యక్రమం తోడ్పడిందన్నారు. గ్రామీణ భారతదేశంలో నిరుపేద విద్యార్ధులకు డిజిటల్ విద్యను ప్రమోట్ చేస్తామన్నారు.