బిజినెస్

వడ్డీ రేట్లను తగ్గించిన బ్యాంక్ ఆఫ్ బరోడా

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

న్యూఢిల్లీ, జనవరి 5: ప్రభుత్వ రంగ బ్యాంకుల్లో ఒకటైన బ్యాంక్ ఆఫ్ బరోడా (బిఓబి) వివిధ కాల పరిమితులతో కూడిన రుణాలపై ప్రామాణిక వడ్డీ రేట్లను 75 బేసిస్ పాయింట్ల మేరకు తగ్గించింది. నిధుల వ్యయం ఆధారంగా నిర్ణయించే ఈ కొత్త వడ్డీ రేట్లు (ఎంసిఎల్‌ఆర్) కొత్త రేట్లు ఈ నెల 7వ తేదీ నుంచి అమలులోకి వస్తాయని, అన్ని కొత్త ఖాతాలతో పాటు రెన్యువల్ చేయించుకున్న రుణ ఖాతాలకు ఈ రేట్లు వర్తిస్తాయని ఆ బ్యాంకు గురువారం ఒక ప్రకటనలో వెల్లడించింది. ఇప్పటివరకూ 8.80 శాతంగా ఉన్న ఓవర్‌నైట్ ఎంసిఎల్‌ఆర్‌ను 8.10 శాతానికి తగ్గించామని, ఒక నెల ఎంసిఆర్‌ను 8.15 శాతంగా నిర్ణయించామని, అలాగే మూడు నెలల ఎంసిఎల్‌ఆర్‌ను 8.95 శాతం నుంచి 8.20 శాతానికి, ఒక సంసవత్సరం ఎంసిఎల్‌ఆర్‌ను 9.05 శాతం నుంచి 8.35 శాతానికి, మూడు సంవత్సరాల ఎంసిఎల్‌ఆర్‌ను 9.05 శాతం నుంచి 8.50 శాతానికి తగ్గించామని బ్యాంక్ ఆఫ్ బరోడా వివరించింది. పెద్ద నోట్ల రద్దు అనంతరం బ్యాంకులకు భారీ మొత్తంలో డిపాజిట్లు రావడంతో ప్రభుత్వ రంగంలోని అతిపెద్ద బ్యాంకు అయిన ఎస్‌బిఐ (స్టేట్ బ్యాంక్ ఆఫ్ ఇండియా)తో పాటు కెనరా బ్యాంకు, యూనియన్ బ్యాంకు, హెచ్‌డిఎఫ్‌సి బ్యాంకు, కోటక్ మహీంద్ర తదితర పలు బ్యాంకులు ఇప్పటికే తమ ప్రామాణిక వడ్డీ రేట్లను తగ్గించిన విషయం తెలిసిందే. అలాగే గృహ నిర్మాణాలకు రుణాలిస్తున్న హెచ్‌డిఎఫ్‌సి, ఇండియాబుల్స్ ఫైనాన్స్ సంస్థలు కూడా తమ రుణాలపై వడ్డీ రేట్లను తగ్గించాయి.