బిజినెస్

2.30 లక్షల కంటైనర్ల దిగుమతి, ఎగుమతులు లక్ష్యం

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

ముత్తుకూరు, జనవరి 6: కృష్ణపట్నం పోర్టు ద్వారా ఈ సంవత్సరం 2 లక్షల 30 వేల కంటైనర్లను దిగుమతులు, ఎగుమతులు చేసుకోవడమే లక్ష్యంగా పెట్టుకున్నామని ఓడరేవు సిఇఒ అనిల్‌కుమార్ అన్నారు. శుక్రవారం గుజరాత్ రాష్ట్రం కాండ్ల పోర్టు నుండి కాందీడాక్-1 అనే నౌక కృష్ణపట్నం ఓడరేవులోని సౌత్‌బెర్తు వద్ద లంగరు వేసుకుంది. మల్టీమోడల్ మూవెంట్ ఆఫ్ విండీమిల్ టవర్స్ ఈ నౌక ద్వారా కృష్ణపట్నం ఓడరేవుకు చేరుకున్నాయి. ఈ నౌకను గమేస రినేవేబుల్ ప్రైవేటు లిమిటెడ్ సిఎండి రమేష్ ప్రారంభించారు. 64 సౌర టవర్లు మొట్టమొదటిసారిగా నౌక ద్వారా ఓడరేవుకు వచ్చాయి. అనంతరం కృష్ణపట్నం సిఇఒ అనిల్‌కుమార్ మాట్లాడుతూ ఈ టవర్లను గుజరాత్ రాష్ట్రం నుంచి అనంతపురం జిల్లాకు రోడ్డు మార్గాన గమేస కంపెనీ తీసుకెళ్లాల్సి ఉండగా, ఈ తరుణంలో సురక్షితంగా జలమార్గం ద్వారా ఓడరేవుకు తీసుకొచ్చామని ఇక్కడ నుంచి ఆ ప్రాంతానికి వీటిని పంపిస్తామన్నారు. ఎన్‌టిసి లాజిస్టిక్ ఇండియా ప్రై. లిమిటెడ్ వారు నాయకల్ ట్రాన్స్‌పోర్టు ద్వారా ఈ టవర్లను ఆ ప్రాంతానికి రవాణా చేయ సంకల్పించారన్నారు. నిరుడు లక్షా 20 వేల మెట్రిక్ టన్నుల కార్బోను ఎగుమతి, దిగుమతులు చేశామని, ఈ సంవత్సరం రెండు లక్షల పైబడి లక్ష్యంగా పెట్టుకున్నామన్నారు. పారిశ్రామిక అభివృద్ధిలో సోలార్ టవర్లు మొదటిసారిగా ఓడరేవుకు రావటం శుభపరిణామని అన్నారు.
అనంతరం గమేస కంపెనీ సిఎండి రమేష్ మాట్లాడుతూ ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు పారిశ్రామిక ప్రగతికి చేస్తున్న కృషి బాగుందని కొనియాడారు. నెల్లూరు జిల్లాలో పరిశ్రమలు ఎక్కువగా స్థాపన జరగడం, అందుకు ఓడరేవు ఏర్పాటు కావడం అతి తక్కువ కాలంలో పోర్టు ప్రతిభను చాటిందని ఆయన హర్షం వ్యక్తం చేశారు.

చిత్రం.. కృష్ణపట్నం ఓడరేవులో లంగరేసిన భారీ నౌక