బిజినెస్

సుష్మా స్వరాజ్ హెచ్చరికతో దిగొచ్చిన ‘అమెజాన్’

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

న్యూఢిల్లీ, జనవరి 12: భారత జాతీయ జెండాను అవమానించే విధంగా త్రివర్ణాలను ముద్రించి తయారు చేసిన డోర్ మ్యాట్ల అమ్మకాలను అంతర్జాతీయ ఆన్‌లైన్ మార్కెట్ దిగ్గజం ‘అమెజాన్’ ఎట్టకేలకు ఉపసంహరించుకుంది. ఈ విషయాన్ని విదేశీ వ్యవహారాల శాఖ (ఎంఇఎ) ధ్రువీకరించింది. ఒట్టావాలోని భారత రాయబార కార్యాలయం ఈ విషయాన్ని కెనడాలోని అమెజాన్ శాఖ దృష్టికి తీసుకెళ్లడంతో వారు ఈ డోర్ మ్యాట్ల అమ్మకాన్ని నిలిపివేశారని కేంద్ర ప్రభుత్వ సీనియర్ అధికారి ఒకరు తెలిపారు. అమెజాన్ ఉద్యోగులకు భారత వీసాలు ఇవ్వకుండా బహిష్కరిస్తామని విదేశీ వ్యవహారాల శాఖ మంత్రి సుష్మా స్వరాజ్ బుధవారం తీవ్రస్థాయిలో హెచ్చరించడంతో ఆ సంస్థ ఈ డోర్ మ్యాట్ల అమ్మకాన్ని ఉపసంహరించుకుంది. ‘మా జాతీయ పతకాన్ని అవమానపర్చేలా ఉన్న అన్ని ఉత్పత్తులను తక్షణమే ఉపసంహరించుకుని అమెజాన్ బేషరుతుగా క్షమాపణ చెప్పాలి. అలా జరగని పక్షంలో అమెజాన్ ఉద్యోగులకు భారత వీసాలను మంజూరుచేసే ప్రసక్తే లేదు. అంతేకాకుండా గతంలో ఆ సంస్థ ఉద్యోగులకు జారీచేసిన వీసాలను కూడా వెనక్కి తీసేసుకుంటాం’ అని సుష్మా స్వరాజ్ ‘ట్విట్టర్’ ద్వారా ఘాటుగా హెచ్చరించారు. ఈ ట్వీట్‌కు ఆన్‌లైన్‌లో విస్తృత స్పందన లభించింది. దీనిపై స్పందించిన వారిలో అమెజాన్ సంస్థకు చెందిన పలువురు ఉద్యోగులు కూడా ఉన్నారు. కెనడా వాసుల కోసం రూపొందించిన ఈ డోర్ మ్యాట్లను భారత్‌లో అమ్మడం లేదని, అయినప్పటికీ ఈ విషయాన్ని తమ సంస్థలోని ఇతర బృందాల దృష్టికి కూడా తీసుకెళ్తామని వారు తెలిపారు. ఆ తర్వాత సుష్మా స్వరాజ్ డిమాండ్ మేరకు ప్రపంచ వ్యాప్తంగా ఈ డోర్ మ్యాట్ల అమ్మకాలను ఉపసంహరించుకోవాలని అమెజాన్ సంస్థకు స్పష్టం చేసినట్లు విదేశీ వ్యవహారాల శాఖ వెల్లడించింది.