బిజినెస్

దేశీయ స్టాక్ మార్కెట్లకు ఐఎమ్‌ఎఫ్ దెబ్బ

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

ముంబయి, జనవరి 17: దేశీయ స్టాక్ మార్కెట్లు మంగళవారం నష్టాల్లో ముగిశాయి. ఈ ఆర్థిక సంవత్సరానికి (2016-17)గాను భారత జిడిపి వృద్ధిరేటు అంచనాను అంతర్జాతీయ ద్రవ్యనిధి (ఐఎమ్‌ఎఫ్) తగ్గించిన నేపథ్యంలో మదుపరులు అమ్మకాల ఒత్తిడికి గురయ్యారు. దేశ జిడిపి వృద్ధిరేటు ఈసారి 6.6 శాతానికే పరిమితం కాగలదని సోమవారం ఐఎమ్‌ఎఫ్ అంచనా వేసింది. అంతకుముందు ఇది 7.6 శాతంగా ఉంటుందని అంచనా వేసినప్పటికీ.. పాత పెద్ద నోట్ల రద్దు నేపథ్యంలో సవరించాల్సి వచ్చిందని పేర్కొంది. ఈ క్రమంలోనే బాంబే స్టాక్ ఎక్స్‌చేంజ్ సూచీ సెనె్సక్స్ 52.51 పాయింట్లు కోల్పోయి 27,235.66 వద్ద స్థిరపడితే, నేషనల్ స్టాక్ ఎక్స్‌చేంజ్ సూచీ నిఫ్టీ 14.80 పాయింట్లు దిగజారి 8,398 వద్ద నిలిచింది. నిజానికి వస్తు, సేవల పన్ను (జిఎస్‌టి) ఆమోదం నష్టాలను కొంతమేర తగ్గించిందని మార్కెట్ వర్గాలు అంచనా వేస్తున్నాయి. తొమ్మిదిసార్లు చర్చల అనంతరం సోమవారం కేంద్రం, రాష్ట్రాల మధ్య జరిగిన జిఎస్‌టి కౌన్సిల్ సమావేశంలో పన్ను విధానంపై ఏకాభిప్రాయం కుదిరింది. కాగా, లోహ, చమురు, గ్యాస్, పిఎస్‌యు, ఆటో, బ్యాంకింగ్ రంగాల షేర్లు 1.52 శాతం వరకు క్షీణించాయి. అంతర్జాతీయంగా ఆసియా మార్కెట్లలో ప్రధాన సూచీలైన హాం కాంగ్, చైనా లాభపడితే, ఐరోపా మార్కెట్లలో కీలక సూచీలైన బ్రిటన్, జర్మనీ, ఫ్రాన్స్‌లు నష్టాల్లో కదలాడాయి.