బిజినెస్

‘బిఎస్‌ఇ ఐపిఒ ధర ఆకర్షణీయం’

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

ఆసియాలోనే అత్యంత ప్రాచీన స్టాక్ ఎక్స్‌చేంజైన బాంబే స్టాక్ ఎక్స్‌చేంజ్.. ఇనీషియల్ పబ్లిక్ ఆఫర్ (ఐపిఒ) ధర ఆకర్షణీయంగా ఉందని బ్యాంకర్లు అన్నారు. సంస్థాగత మదుపరుల నుంచి మంచి స్పందన వచ్చే వీలుందని ముంబయిలో మంగళవారం మాట్లాడుతూ అభిప్రాయపడ్డారు. బిఎస్‌ఇ ఐపిఒలో ఒక్కో షేర్ ధరను 805-806 రూపాయలుగా నిర్ణయించారు. 1,243 కోట్ల రూపాయల నిధుల సమీకరణే లక్ష్యంగా ఈ పబ్లిక్ ఇష్యూకు బిఎస్‌ఇ దిగుతోంది. మూడు రోజులపాటు జరగనున్న ఈ ఐపిఒ.. ఈ నెల 23న ప్రారంభమై, 25న ముగుస్తుంది. ఈ ఏడాది పబ్లిక్ ఇష్యూల్లో బిఎస్‌ఇదే మొదటిది. 15.43 మిలియన్ షేర్లను బిఎస్‌ఇ ఈ సందర్భంగా విక్రయించనుంది. ఈ షేర్లన్నీ గరిష్ఠ స్థాయిలో అమ్ముడైతే బాంబే స్టాక్ ఎక్స్‌చేంజ్‌కు 1,243 కోట్ల రూపాయల నిధులు అందుతాయని అంచనా.