బిజినెస్

కొలంబో-విశాఖ మధ్య నేరుగా విమాన సర్వీసులు

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

విశాఖపట్నం, జనవరి 19: విశాఖలో ఐటి పరిశ్రమను అభివృద్ధి పరిచేందుకు అవసరమైన విమాన సర్వీసులను విస్తృతపర్చేందుకు ప్రతిపాదనలు పంపాలని ప్రభుత్వ ప్రధాన కార్యదర్శి ఎస్‌పి టక్కర్ కలెక్టర్ ప్రవీణ్‌కుమార్‌ను ఆదేశించారు. ఎయిర్ కనెక్టివిటీ పెంపొందించాల్సిన రూట్లపై ఎయిర్‌పోర్టు అథారిటీ అధికారులతో సంప్రదించి వెంటనే వారి నుండి ప్రతిపాదనలు పొంది తమకు పంపిస్తే తదుపరి చర్యలు చేపడతామన్నారు. గురువారం విజయవాడ నుండి ఐటి సెక్రటరీ కె.విజయానంద్, ఏపిఐఐసి మేనేజింగ్ డైరెక్టర్ జె.నివాస్ తదితరులతో కలసి కలెక్టర్ ప్రవీణ్‌కుమార్, ఐటి అధికారులు, అసోసియేషన్ ప్రతినిధులతో ఆయన వీడియో కాన్ఫరెన్స్ నిర్వహించారు. విశాఖలో ఐటి రంగ అభివృద్ధిలో నెలకొన్న అంశాలపై సమీక్షించారు. కలెక్టర్ ప్రవీణ్‌కుమార్ చేసిన ప్రతిపాదనలకు ఆయన స్పందిస్తూ కొలంబో నుండి విశాఖకు నేరుగా విమాన సర్వీసులు, విశాఖ-తిరుపతి మధ్య రెండు ట్రిప్పుల విమాన సర్వీసుల అమలు, వీసా ఆన్ ఎరైవర్ అంశాలపై ప్రతిపాదనలు వెంటనే పంపాలని కలెక్టర్‌కు సూచించారు. రుషికొండ ఐటి సెజ్ హిల్ నెంబర్-2లో క్యూర్ టెక్ నుండి మిరాకిల్ సాఫ్ట్‌వేర్‌కు బదిలీ చేసిన ప్లాట్ నెంబర్ 17కు సంబందించి కస్టమ్స్‌కు చెల్లించాల్సిన సొమ్మును ఏపిఐఐసి వెంటనే చెల్లించి, తదుపరి మిరాకిల్ సాప్టువేర్ నుండి రివరీ చేయాలని కలెక్టర్‌కు సూచించారు. ఐటి సెజ్‌లో ప్లాట్లు పొంది ఇప్పటి వరకు ఆపరేషన్ ప్రారంభించని కంపెనీలు, ఒప్పందాల మేరకు ఉద్యోగ అవకాశాలు కల్పించని కంపెనీలకు సంజాయిషీ కోరుతూ వెంటనే తాఖీదులు జారీ చేయాలని సూచించారు. గుజరాత్ మోడల్‌లో ఐటి పాలసీని సవరించాలని ఆంధ్రప్రదేశ్ ఐటి అసోసియేషన్ ప్రతినిధులు ఇ-రవి, కె.శ్రీ్ధర్ చేసిన విజ్ఞప్తికి సిఎస్ స్పందిస్తూ ఇప్పటికే డ్రాప్టు ఐటి, పాలసీ రూపొందించామని, ఈ నెల 25న క్యాబినెట్‌లో చర్చ జరుగనుందన్నారు. విశాఖపట్నం స్వయంగా ఒకసారి వెళ్ళి ఐటి ప్రతినిధులు చేసే సూచనలు, సలహాలను పరిశీలించి తమకు నివేదిక సమర్పించాలని ఐటి సెక్రటరీ కె.విజయానంద్‌ను ఆయన ఆదేశించారు. కలెక్టర్ ప్రవీణ్‌కుమార్ మాట్లాడుతూ ఐటి కంపెనీల విస్తరణకు నగర పరిధిలో తగినంత భూమి అందుబాటులో లేదని, ఇందుకు హెల్త్ సిటీ పక్కనున్న 36 ఎకరాల భూమిని ఏపిఐఐసికి అప్పగిస్తే బాగుంటుందని సిఎస్‌ను కోరారు. అందుకు అవసరమైన ప్రతిపాదనలు పంపిస్తే పరిశీలించి తగు నిర్ణయం తసీకుంటామన్నారు. ఏపిఐఐసి జోనల్ మేనేజర్ యతిరాజులు, ఏపీ ఎలక్ట్రానిక్ అండ్ ఐటి ఏజెన్సీ సిఇఓ ఎస్‌ఏ శ్రీనివాసమూర్తి పాల్గొన్నారు.

చిత్రం..వీడియో కాన్ఫరెన్స్‌లో అధికారులతో సమీక్షిస్తున్న సిఎస్ టక్కర్