బిజినెస్

రెండో రోజూ లాభాల పంట

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

ముంబయి, జనవరి 19: దేశీయ స్టాక్ మార్కెట్లు వరసగా రెండో రోజూ లాభాలతో ముగిశాయి. అమెరికా కొత్త అధ్యక్షుడు డొనాల్డ్ ట్రంప్ విధానాలు, త్వరలో రానున్న కేంద్ర బడ్జెట్‌ల నేపథ్యంలో మదుపరులు స్థిరంగా పెట్టుబడులు పెట్టడం మార్కెట్లకు కలిసి వచ్చింది. చమురు, గ్యాస్, పిఎస్‌యు స్టాక్స్ పట్ల మదుపరులు ఉత్సాహం చూపించారు. ఫలితంగా బిఎస్‌ఇ సెనె్సక్స్ దాదాపు 51 పాయింట్లు లాభపడి 27,308.60 పాయింట్ల వద్ద ముగియగా, నేషనల్ స్టాక్ ఎక్స్‌చేంజి సూచీ నిఫ్టీ సైతం 18.10 పాయింట్లు లాభపడి 8,435.10 పాయింట్ల వద్ద ముగిసింది. ఉదయంనుంచి కూడా ప్రధాన సూచీలు లాభాల్లోనే కదలాడాయి. యెస్ బ్యాంక్ త్రైమాసిక లాభాలు 30.6 శాతం పెరిగిన నేపథ్యంలో ఆ సంస్థ షేరు 0.6 శాతం పెరిగింది. కాగా, యాక్సిస్ బ్యాంక్ ఫలితాలు నిరాశాజనకంగా ఉండడంతో దాని షేరు 0.95 శాతం పడిపోయింది. గెయిల్, పవర్‌గ్రిడ్, ఒఎన్‌జిసి, టాటా మోటార్స్, ఐటిసి, అదానీ పోర్ట్స్, భారతీ ఎయిర్‌టెల్, హీరో మోటోకార్ప్ షేర్లు లాభాల్లో ముగియగా, సన్‌ఫార్మా, విప్రో, హెచ్‌డిఎఫ్‌సి బ్యాంక్, హెచ్‌డిఎఫ్‌సి షేర్లు నష్టపోయాయి. సెనె్సక్స్‌లోని 30 కంపెనీల్లో 14 కంపెనీల షేర్లు పెరగ్గా, 16 షేర్లు నష్టపోయాయి. కాగా ఆసియా మార్కెట్లలో మిశ్రమ ధోరణి కనిపించగా, ఐరోపా మార్కెట్లు ప్రారంభంనుంచే లాభాల్లో సాగాయి.