బిజినెస్

వసూళ్లు ప్రారంభించండి

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

బెంగళూరు, జనవరి 19: కింగ్‌ఫిషర్ ఎయిర్‌లైన్స్ కేసుకు సంబంధించి ప్రముఖ మద్యం వ్యాపారి విజయ్ మాల్యాతో పాటు ఆయనకు చెందిన కొన్ని సంస్థల నుంచి దాదాపు 9 వేల కోట్ల రూపాయల బకాయిల రికవరీకి చర్యలు చేపట్టేందుకు డెట్ రికవరీ ట్రిబ్యునల్ (డిఆర్‌టి) బ్యాంకులకు అనుమతి ఇచ్చింది. మాల్యా నుంచి బకాయిలను వసూలు చేసుకునేందుకు అనుమతి ఇవ్వాలని కోరుతూ స్టేట్ బ్యాంక్ ఆఫ్ ఇండియా (ఎస్‌బిఐ) నేతృత్వంలో 17 బ్యాంకులతో ఏర్పడిన కన్సార్టియం డిఆర్‌టికి దరఖాస్తులు చేసింది. దీంతో మాల్యాతో పాటు కింగ్‌ఫిషర్ ఎయిర్‌లైన్స్, యునైటెడ్ బ్రూవరీస్ హోల్డింగ్స్ లిమిటెడ్ (యుబిహెచ్‌ఎల్), కింగ్‌ఫిషర్ ఫిన్‌వెస్ట్ సంస్థల నుంచి ఆ బకాయలను రికవరీ చేసేందుకు డిఆర్‌టి బ్యాంకులకు అనుమతి ఇచ్చింది. 2013లో బ్యాంకుల కన్సార్టియం దరఖాస్తు చేసుకున్న నాటికి విజయ్ మాల్యా బకాయి పడిన 6,203 కోట్ల రూపాయల అసలు మొత్తంతో పాటు దానిపై 11.5 శాతం రేటుతో వడ్డీని రికవరీ చేయాలని డెట్ రికవరీ ట్రిబ్యునల్ ఆదేశించింది. దీంతో కింగ్‌ఫిషర్ ఎయిర్‌లైన్స్ నుంచి బకాయిలను రాబట్టుకునేందుకు బ్యాంకుల కన్సార్టియం మూడేళ్ల నుంచి సాగిస్తున్న న్యాయ పోరాటానికి తెరపడినట్లయింది.
కింగ్‌ఫిషర్ ఎయిర్‌లైన్స్ నుంచి బకాయలను వసూలు చేసుకునే విషయమై బ్యాంకుల కన్సార్టియం 2013లో డెట్ రికవరీ ట్రిబ్యునల్‌ను ఆశ్రయించింది. రుణ బకాయిల చెల్లింపులో విఫలమైనందుకు కింగ్‌ఫిషర్ ఎయిర్‌లైన్స్ సంస్థ అధినేత మాల్యాను అరెస్టు చేయడంతో పాటు ఆయన పాస్‌పోర్టును స్వాధీనం చేసుకోవాలని కోరుతూ ఎస్‌బిఐ ఈ సందర్భంగా పిటిషన్లు దాఖలు చేసింది.
అయితే గత ఏడాది మార్చి 2వ తేదీన దేశం నుంచి పారిపోయిన విజయ్ మాల్యా ప్రస్తుతం బ్రిటన్‌లో నివసిస్తున్న విషయం విదితమే. దీంతో బ్యాంకులకు రుణాల ఎగవేత వ్యవహారంలో మాల్యాపై మనీ లాండరింగ్ చట్టం కింద దర్యాప్తు జరుపుతున్న ఎన్‌ఫోర్స్‌మెంట్ డైరెక్టరేట్ (ఇడి) విజ్ఞప్తి మేరకు ముంబయిలోని ప్రత్యేక కోర్టు ఆయనను ‘పరారీలో ఉన్న నిందితుడు’గా ప్రకటించింది.

చిత్రం..విజయ్ మాల్యా