బిజినెస్

మందగమనంలో చైనా ఆర్థిక వ్యవస్థ

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

బీజింగ్, జనవరి 20: ప్రపంచంలోనే రెండో అతిపెద్ద ఆర్థిక వ్యవస్థ, వేగవంతమైన వృద్ధిరేటు కలిగిన ఆర్థిక వ్యవస్థ, ప్రపంచ దేశాలను నడిపించే ఆర్థిక వ్యవస్థ. ఇవీ.. చైనా ఆర్థిక వ్యవస్థ పరిచయానికి ముందు ఇప్పటిదాకా వాడుతున్న విశేషణాలు. కానీ ఇప్పుడు ఆ పరిస్థితి పోయినట్లే కనిపిస్తోంది. అవును మరి.. అగ్రరాజ్యం అమెరికా ఆర్థిక వ్యవస్థకే సవాల్ విసిరిన డ్రాగన్ ఎకానమీ మందగమనంలో పడింది. నిరుడు చైనా ఆర్థిక వృద్ధిరేటు ఏకంగా 26 సంవత్సరాల కనిష్టానికి దిగజారింది. 2016లో కేవలం 6.7 శాతానికే పరిమితమైంది. ఈ మేరకు శుక్రవారం విడుదలైన చైనా ప్రభుత్వ గణాంకాలు స్పష్టం చేస్తున్నాయి. ప్రతికూల పరిస్థితుల మధ్య 2016కుగాను నిర్దేశించుకున్న ప్రభుత్వ లక్ష్యాలకు లోబడే చైనా జిడిపి వృద్ధిరేటు ఉండగా, 2015 సంవత్సరంలోనూ వృద్ధిరేటు 6.9 శాతానికి పడిపోయింది. 2016లో ఇది మరింత పతనమైపోవడం చైనాను ఇప్పుడు కలవరపెడుతోంది. నిజానికి నిరుడు జూలై-సెప్టెంబర్ త్రైమాసికంతో పోల్చితే అక్టోబర్-డిసెంబర్ త్రైమాసికంలో చైనా జిడిపి వృద్ధిరేటు 6.7 శాతం నుంచి 6.8 శాతానికి పెరిగింది. అయినప్పటికీ 2015తో చూస్తే 2016లో క్షీణతే చోటుచేసుకుంది. అయితే చైనా ఆర్థిక వ్యవస్థ పరిమాణం 2015లో 354.6 బిలియన్ యువాన్లు పెరిగి 68.91 ట్రిలియన్ యువాన్లకు చేరిందని జనవరి 9న చైనా సవరించుకుంది. కానీ వాస్తవ పరిస్థితులు మరోలా కనిపిస్తున్నాయి. చైనా ఆర్థిక వ్యవస్థ కోలుకున్న దాఖలాలేమీ కనిపించడం లేదు. డాలర్‌తో పోల్చితే చైనా కరెన్సీ యువాన్ విలువ క్రమేణా నష్టపోతోంది. గత సంవత్స రం నుంచి దాదాపు 6.90 శాతం క్షీణించింది. అంతర్జాతీయంగా అమెరికా నుంచి ఆసియా ఖండంలో భారత్ నుంచి చైనా ఎగుమతులకూ గట్టి పోటీ వ్యక్తమవుతోంది. దీంతో ప్రపం చ ఆర్థిక వ్యవస్థకు సారథ్యం వహించాలన్న చైనా కోరిక కలగానే మిగిలిపోగా, ఇంతకంటే వృద్ధిరేటు పతనమైతే అంతర్జాతీయ ఆర్థిక వ్యవస్థలో తన స్థానంలోకి భారత్ వస్తుందన్న భయమూ డ్రాగన్‌ను వెంటాడుతోంద ని నిపుణులు అభిప్రాయపడుతున్నా రు. మొత్తానికి చైనాను ఇప్పుడు ఆర్థిక మందగమనం కలవరపెడుతోంది.