బిజినెస్

తులిప్ లాజిస్టిక్ సేవలు ఆరంభం

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

హైదరాబాద్, జనవరి 20: తులిప్ లాజిస్టిక్ దేశీయ సేవలను నిజామాబాద్ ఎంపి కవిత శుక్రవారం ప్రారంభించారు. సరకు రవాణాలో సత్వర సేవలకు సాంకేతిక సాయం అందించడం మంచి పరిణామం అని అన్నారు. అసంఘటిత రంగంలోని లారీ యజమానులు, డ్రైవర్లకు ఇది ఉపయోగపడుతుందని కవిత తెలిపారు. సరకు అన్‌లోడ్ చేసిన తరువాత తిరిగి వచ్చేప్పుడు సహజంగా లారీలు ఖాళీగానే వస్తుంటాయి. అయతే లారీలు ఖాళీగా రాకుండా వారు వచ్చే మార్గంలో సరకు రావాణా చేసే అవకాశాన్ని తులిప్ కల్పిస్తుంది. దీనివల్ల లారీ యజమానులకు ఆర్థికంగా లాభం చేకూరుతుంది. కాగా, తెలంగాణ నుంచే తులిప్ సేవలు ప్రారంభం కావడం సంతోషంగా ఉందని కవిత అన్నారు. కార్యక్రమంలో తులిప్ చైర్మన్ మదన్, ఎమ్మెల్యేలు అరికపొడి గాంధీ, మాగంటి గోపీనాథ్, తులిప్ సిఇఒ నివాస్, సిఒఒ సునీల్ పాల్గొన్నారు.

చిత్రం..తులిప్ లాజిస్టిక్ దేశీయ సేవల ప్రారంభ దృశ్యం