బిజినెస్

భారత్ నుంచి సింగపూర్‌కు భారీగా పెట్టుబడులు

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

న్యూఢిల్లీ, జనవరి 22: విదేశాల్లో భారత సంస్థల మొత్తం ప్రత్యక్ష పెట్టుబడులు గత నెలలో 32 శాతం పెరిగి 2.49 బిలియన్ డాలర్లకు చేరుకున్నాయి. భారత కంపెనీల పెట్టుబడులకు సింగపూర్ ప్రధాన గమ్యస్థానంగా ఆవిర్భవించింది. డిసెంబర్‌లో భారత సంస్థలు సింగపూర్‌లో 2.06 బిలియన్ డాలర్ల పెట్టుబడులు పెట్టాయి. ఆ దేశంలో పెట్టుబడులు పెడతామని భారత కంపెనీలు హామీ ఇచ్చిన మొత్తం సొమ్ములో ఇది 82.5 శాతం కంటే ఎక్కువ. అలాగే గత నెలలో భారత సంస్థల నుంచి పెట్టుబడులను ఆకర్షించిన ఇతర దేశాల్లో బ్రిటన్ (916.47 మిలియన్ డాలర్లు), మారిషస్ (899.39 మిలియన్ డాలర్లు), అమెరికా (368.76 మిలియన్ డాలర్లు), నెదర్లాండ్స్ (262.52 మిలియన్ డాలర్లు), యునైటెడ్ అరబ్ ఎమిరేట్స్ (189.05 మిలియన్ డాలర్లు) ఉన్నట్లు రిజర్వు బ్యాంకు వెల్లడించింది. విదేశాల్లో భారత సంస్థలు పెట్టిన పెట్టుబడుల వివరాలను దేశాల వారీగా రిజర్వు బ్యాంకు వెల్లడించడం ఇదే తొలిసారి.