బిజినెస్

నల్ల కుబేరులపై ఐటి కన్ను

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

కడప, జనవరి 22 : పెద్ద నోట్ల రద్దు అనంతరం నల్లకుబేరులను వెలికితీసేందుకు ఇన్‌కమ్ ట్యాక్స్ అధికారులే నడుం బిగించారు. ఫిబ్రవరి 1వ తేది నుంచి బ్యాంకులు, తపాల శాఖలపై దాడులు చేసి రికార్డులు స్వాధీనం చేసుకుని తనిఖీ చేస్తామని ఐటి అధికారులు హెచ్చరిస్తున్నారు. జనవరి చివరి లోపు బ్యాంకులు, తపాలశాఖలు పూర్తిస్థాయిలో ఖాతాదారుల వివరాలు అందజేయాలని ఆదివారం సంబంధిత బ్యాంకుల ప్రధాన కార్యాలయాల నుంచి అన్ని బ్యాంకులకు ఆదేశాలు అందాయి. జాబితాలు వెలికి తీసేందుకు బ్యాంకులు, తపాలశాఖ అధికారులకు ఖాతాదారుల వివరాలు తెలియజేయాలని ఇన్‌కమ్ ట్యాక్స్ అధికారుల నుంచి ఆదివారం సెలవుదినమైనా ఆదేశాలు అందినట్లు తెలుస్తోంది. సంబంధిత బ్యాంకుల ప్రధాన కార్యాలయాల నుంచి ఖాతాదారుల వివరాలను సిద్ధం చేసుకోవాలని శనివారం స్థానిక బ్యాంకు అధికారులకు ఉత్తర్వులు అందాయి. ఈ ఫైలింగ్ నమూనాల ద్వారా ఖాతాదారుల వివరాలు, బ్యాంకుల్లో జమ చేసిన నగదు, లావాదేవీలు జరిగిన ఖాతాదారుని వివరాలను ఆదాయపు పన్ను అధికారులకు వెంటనే అందజేయాల్సి ఉంది. జిల్లాలో 33 జాతీయ బ్యాంకులు ఉండగా ఆ బ్యాంకులకు సంబంధించి 370 శాఖలు ఉన్నాయి. ఆ శాఖలలో ఆంధ్రప్రగతి గ్రామీణ బ్యాంకులు 109 ఉన్నాయి. ఈ బ్యాంకుల్లో 35వేల మంది ఖాతాదారులు ఉండగా, వారు ఇప్పటి వరకూ రూ. 11 లక్షల కోట్ల రూపాయలు డిపాజిట్ చేశారు. జనధన్ కింద 4.5 లక్షల మంది ఖాతాదారులు ఉన్నారు. అయితే పెద్దనోట్ల రద్దు అనంతరం గత ఏడాది నవంబర్ 9 నుంచి డిసెంబర్ 31వ తేదీ వరకూ బ్యాంకుల్లో జమ అయిన డిపాజిట్లలో సేవింగ్ అకౌంట్ల కింద రూ. 2.5 లక్షలు, అంతకుమించి జమ చేసిన ఖాతాల వివరాలు అందేజయాలని ఐటి అధికారులు ఆదేశించారు. అలాగే కరెంట్ ఖాతా కింద రూ. 12.5 లక్షలు జమచేసిన వారి వివరాలు కూడా తెలియజేయాల్సి ఉంది. ముఖ్యంగా ఆదాయపు పన్నుశాఖకు కొనే్నళ్లుగా పన్నులు చెల్లించకుండా తప్పించుకుని తిరిగిన ముసుగుదొంగలు, నల్లధన కుబేరులను వెలికి తీయడమే ధ్యేయంగా పెట్టుకుని బ్యాంకుల్లో రుణాలు తీసుకున్న వారి వివరాలు, బంగారు నగలు తాకట్టు పెట్టి నగదు తీసుకున్న వారు, పరిశ్రమలు, వ్యాపారాల కోసం బ్యాంకుల నుంచి రుణాలు తీసుకుని వాటిని స్థాపించకనే బ్యాంకులను మోసగించడంతో పాటు ఇన్‌కమ్ ట్యాక్స్‌ను కూడా మోసగించిన వారందరినీ వెలికి తీస్తున్నారు. లాకర్ల ద్వారా బ్యాంకుల్లో భద్రంగా ఉంచిన బంగారు నగల వివరాలను కూడా ఆరా తీసేందుకే ఐటి అధికారుల దాడులని చెప్పవచ్చు. పెద్దనోట్ల రద్దు అనంతరం పాతనోట్లను నవంబర్ 9 నుంచి డిసెంబర్ 31వ తేదీ వరకూ తమ ఖాతాల్లో జమ చేసుకున్న వారిపైనే ఐటి కనే్నసింది. కేవలం పెద్ద నోట్ల రద్దుతో బ్యాంకులు, పోస్ట్ఫాసుల్లో రావాదేవీలు జరిగిన వివరాలపైనే ఐటి దృష్టి కేంద్రీకరించింది. నల్లకుబేరులకు సహకరించి పాతనోట్లు మార్పిడి చేసిన పలువురు బ్యాంకు, పోస్టల్ అధికారుల ప్రమేయం కూడా ప్రస్తుతం ఐటి శాఖ ఆదేశించిన వివరాల్లో బట్టబయలుకానున్నాయి. ముఖ్యంగా పెద్దనోట్ల రద్దు ప్రకటించిన నవంబర్ 8వ తేదీ రాత్రే జిల్లాలోని పలు బ్యాంకుల్లో వందలాది కోట్ల రూపాయలు జమ అయినట్లు ఐటి అధికారులు సమాచారం సేకరించారు. వైద్యులు, పారిశ్రామికవేత్తలు, రాజకీయ నాయకులు, వ్యాపారవేత్తలు, రియల్టర్లు, బంగారు నగల వ్యాపారులు, వడ్డీ వ్యాపారులు పెద్ద నోట్ల మార్పిడిలో బినామీలు, దళారులను పలువురు బ్యాంకు, పోస్టల్ అధికారులు వినియోగించినట్లు తెలుస్తోంది. బంగారు అంగళ్లల్లో కూడా ఈ ఫైలింగ్ విధానాన్ని ఖచ్చితంగా అమలుచేయాల్సి ఉంది. మొత్తం మీద ఈ నెల చివరిలోపు నవంబర్ 9 నుంచి డిసెంబర్ 31వ తేదీ వరకూ బ్యాంకులు, తపాలాశాఖల్లో డిపాజిట్ అయిన ఖాతాదారుల వివరాలు ఐటి అధికారులు తెలుసుకోవడంతో నల్లకుబేరుల జాతకాలు బట్టబయలు కానున్నాయి. దీంతో బ్యాంకర్లు, పోస్ట్ఫాసు అధికారుల గుండెల్లో రైళ్లు పరుగెత్తిస్తున్నాయి.