బిజినెస్

ఏప్రిల్‌నుంచే ‘గార్’ అమలు: సిబిడిటి

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

న్యూఢిల్లీ, జనవరి 27: పన్నులను తప్పించుకోవడం కోసం కంపెనీలు వేరే దేశాలగుండా లావాదేవీలను జరపడాన్ని నిరోధించడానికి ఉద్దేశించిన జనరల్ యాంటీ-అవాయిడెన్స్ రూల్స్ (గార్) ఏప్రిల్ 1నుంచి అమలులోకి వస్తాయని కేంద్ర ప్రత్యక్ష పన్నుల బోర్డు (సిబిడిటి) తెలిపింది. అంతేగాకుండా నాన్-టాక్స్ ప్రయోజనాల ఆధారంగా నిధులను మళ్లించిన పక్షంలో లావాదేవీల విధానాన్ని ఎన్నుకొనే వారి హక్కులో తాము జోక్యం చేసుకోబోమని స్పష్టం చేసింది. అయితే గార్‌పై ఆదాయం పన్ను శాఖ ఇచ్చిన వివరణ సరైన దిశలో తీసుకున్న చర్యగా నిపుణులు అభివర్ణిస్తూనే, పరిశ్రమల రంగం మానసికంగా సిద్ధమయ్యే వరకు దాని అమలును వాయిదా వేస్తే బాగుంటుందని అభిప్రాయపడ్డారు.