బిజినెస్

పర్యాటకంలో రూ. 12 వేల కోట్ల పెట్టుబడులు

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

విశాఖపట్నం, జనవరి 28: పర్యాటక రంగంలో పెట్టుబడులు వెల్లువెత్తుతున్నాయి. ఆతిథ్య రంగంతోపాటు ఎంటర్‌టైన్‌మెంట్, స్పోర్ట్స్ అండ్ అడ్వెంచరస్ అంశాల్లో పెట్టుబడులు పెట్టేందుకు ఔత్సాహికులు ముందుకు వస్తున్నారని ఎపి పర్యాటక శాఖ ప్రిన్సిపల్ సెక్రటరీ నాగులాపల్లి శ్రీకాంత్ తెలిపారు. విశాఖ భాగస్వామ్య సదస్సులో పర్యాటక రంగానికి సంబంధించి 96 ఒప్పందాలు కుదుర్చుకున్నామని, 12 వేల కోట్ల రూపాయల పెట్టుబడులు పెట్టేందుకు పలు సంస్థలు ముందుకు వచ్చాయన్నారు.
పర్యాటక శాఖలో 5,230 కోట్ల రూపాయలతో 34 ప్రాజెక్టులు, పర్యాటకాభివృద్ధి సంస్థ (ఎపిటిడిసి)లో 6,658 కోట్ల రూపాయలతో 62 ప్రాజెక్టులు చేపట్టేందుకు ఒప్పందాలు కుదిరాయని వెల్లడించారు. పర్యాటక రంగంలో ఆతిథ్యానికి ఎక్కువ ప్రాధాన్యత ఉందని, దీన్ని దృష్టిలో ఉంచుకుని నక్షత్ర హోటళ్ల నిర్మాణానికి ఔత్సాహికులు ముందుకు వచ్చారన్నారు. 2,300 కోట్ల రూపాయలతో 1,100 గదుల సామర్థ్యం కలిగిన నక్షత్ర హోటళ్ల నిర్మాణం చేపట్టనున్నట్టు తెలిపారు. అలాగే 5,700 కోట్ల రూపాయలతో ఎమ్యూజ్‌మెంట్ పార్కుల ఏర్పాటుకు పలు సంస్థలు సిద్ధంగా ఉన్నాయన్నారు.
విశాఖ ప్రాంతంలో 3,100 కోట్ల రూపాయ లు, విజయవాడ ప్రాంతంలో 3,500 కోట్ల రూపాయలు, తిరుపతిలో 800 కోట్ల రూపాయలతో పర్యాటక ప్రాజెక్టులు రానున్నాయని వివరించారు. 600 కోట్ల రూపాయలతో భవానీ ఐల్యాండ్‌ను అభివృద్ధి పరిచే ప్రాజెక్టు కు కూడా తాజాగా ఎంఒయు కుదుర్చుకున్నామని తెలిపారు. అంతర్జాతీయ ప్రమాణాలతో వీటిని నిర్మించనున్నట్టు వెల్లడించారు.
కాగా, ప్రైవేట్ రంగంలో టూరిజం యూనివర్శిటీ ఏర్పాటు చేయనున్నట్టు హోటల్ రంగంలో నిష్ణాతుడు సివి రమణ వెల్లడించారు. అలాగే సన్ సంస్థ ఆధ్వర్యంలో అమరావతిలో ఇంటర్నేషనల్ యూనివర్శిటీ ఏర్పాటుకు 500 కోట్ల రూపాయలను వెచ్చించనున్నట్టు తెలిపారు. మూడేళ్ల డిగ్రీ కోర్సును పూర్తి చేసిన మీదట ఆతిథ్య రంగంలో ఉపాధి అవకాశాలు కల్పించనున్నట్టు వివరించారు. మెడికల్, వెల్‌నెస్, ఫిట్నెస్, స్పిరిట్యువల్ అంశాలకు అత్యధిక ప్రాధాన్యత ఇచ్చే విధంగా పర్యాటక రంగం అభివృద్ధి సాధిస్తే మంచి ఫలితాలు సాధించేందుకు అవకాశం ఉంటుందని అభిప్రాయపడ్డా రు. సమావేశంలో పర్యాటకాభివృద్ధి సంస్థ చైర్మన్ జయరామిరెడ్డి, మేనేజింగ్ డైరెక్టర్ గిరిజా శంకర్, డైరెక్టర్ హిమాంసు తదితరులు పాల్గొన్నారు.

చిత్రం..పర్యాటక రంగంలో పెట్టుబడులు పెట్టేందుకు ముందుకొచ్చిన ఔత్సాహికులతో చంద్రబాబు నాయుడు