బిజినెస్

10 శాతం వాటాతో ఎస్‌బిఐ లైఫ్ ఐపిఒ

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

హైదరాబాద్, జనవరి 30: ప్రభుత్వరంగ బ్యాంకింగ్ దిగ్గజం ఎస్‌బిఐకి చెందిన అనుబంధ బీమా సంస్థ ఎస్‌బిఐ లైఫ్ ఇన్సూరెన్స్.. తమ పబ్లిక్ ఇష్యూలో 10 శాతం వాటాను అమ్మకానికి పెట్టనుంది. ఇనీషియల్ పబ్లిక్ ఆఫర్ (ఐపిఒ) ద్వారా ఎస్‌బిఐ లైఫ్ ఇన్సూరెన్స్ క్యాపిటల్ మార్కెట్లలోకి ప్రవేశించనుంది. అయితే ఈ ఐపిఒ ఎప్పుడనే దానిపై ఇంకా స్పష్టమైన సమాచారం లేదు. అయినప్పటికీ వచ్చే ఆర్థిక సంవత్సరం (2017-18)లో ఇది ఉండొచ్చనే సంకేతాలను సంస్థ ఎండి, సిఇఒ అరిజిత్ బసు సోమవారం ఇక్కడ జరిగిన విలేఖరుల సమావేశంలో ఇచ్చారు.