బిజినెస్

స్టాక్ మార్కెట్‌కు జిడిపి వృద్ధిరేటు భయాలు

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

ముంబయి, జనవరి 31: దేశీయ స్టాక్ మార్కెట్లు మంగళవారం నష్టపోయాయి. ఈ ఆర్థిక సంవత్సరం (2016-17) దేశ జిడిపి వృద్ధిరేటు గత ఆర్థిక సంవత్సరం (2015-16) కంటే తక్కువగా నమోదు కాగలదన్న అంచనాలు మార్కెట్ సెంటిమెంట్‌ను దెబ్బతీశాయి. ఆర్థిక సర్వేలో ఈసారి జిడిపి వృద్ధిరేటు 6.5 శాతానికే పరిమితం కాగలదన్న అంచనాలున్నాయి. దీంతో మదుపరులు లాభాల స్వీకరణకు దిగగా, హెచ్1-బి వీసాల విషయంలో అమెరికా అధ్యక్షుడు డొనాల్డ్ ట్రంప్ అనుసరిస్తున్న వైఖరి కారణంగా ఐటి షేర్లు అమ్మకాల ఒత్తిడికి లోనయ్యాయి.
ఈ క్రమంలోనే టిసిఎస్, విప్రో, ఇన్ఫోసిస్ షేర్ల విలువ 4.47 శాతం వరకు దిగజారింది. మొత్తం ఐటి సూచీ 2.96 శాతం మేర నష్టపోయింది. నిజానికి ట్రేడింగ్ ఆరంభంలో ఈ నష్టాలు ఎక్కువగా ఉండగా, సమయం గడుస్తున్నకొద్దీ తగ్గుముఖం పట్టాయి.
అయినప్పటికీ బాంబే స్టాక్ ఎక్స్‌చేంజ్ సూచీ సెనె్సక్స్ 193.60 పాయింట్లు కోల్పోయి 27,655.96 వద్ద, నేషనల్ స్టాక్ ఎక్స్‌చేంజ్ సూచీ నిఫ్టీ 71.45 పాయింట్లు పడిపోయి 8,561.30 వద్ద నిలిచాయి. చమురు, గ్యాస్, పిఎస్‌యు, హెల్త్‌కేర్, ఇన్‌ఫ్రాస్ట్రక్చర్, మెటల్ షేర్లు నష్టాలకు లోనయ్యాయి. ఆసియా మార్కెట్లలో కీలకమైన జపాన్ సూచీ పతనమవగా, ఐరోపా మార్కెట్లలో మాత్రం ప్రధాన సూచీలైన ఫ్రాన్స్, జర్మనీ, బ్రిటన్ లాభాల్లో కదలాడాయి.