బిజినెస్

చైనాతో ఆక్వా ఒప్పందాలు

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

భీమవరం, ఫిబ్రవరి 3: ఆక్వా ఉత్పత్తుల్లో ప్రపంచంలోనే అగ్రస్థానంలో ఉన్న చైనాతో ఆంధ్రప్రదేశ్ మత్య్స శాఖ ఒప్పందాలు చేసుకోనుంది. ఈ నెల 11 నుండి 14వ తేదీ వరకు పశ్చిమగోదావరి జిల్లా భీమవరంలోని విష్ణు ఎడ్యుకేషనల్ సోసైటీలో ‘ఫ్రాఫిట్ ఆన్ ఆక్వా కల్చర్’ అంతర్జాతీయ సదస్సు జరగనుంది. ఈ సదస్సు ఒప్పందాలకు వేదిక కానుంది. ఉద్దరాజు ఆనందరాజు ఫౌండేషన్, బ్యాంకాక్‌కు చెందిన ఏషియన్ ఇనిస్టిట్యూట్ ఆఫ్ టెక్నాలజీ, రాష్ట్ర మత్య్స శాఖ, శ్రీ వేంకటేశ్వర యూనివర్సిటీ ఆధ్వర్యంలో ఈ అంతర్జాతీయ సదస్సు నిర్వహించనున్నారు. చైనాకి చెందిన షాంగాయ్ ఓషన్ యూనివర్సిటీ, ఇనిస్టిట్యూట్ ఆఫ్ హైడ్రో బయోలజీ, చైనీస్ అకాడమీ ఆఫ్ సైనె్సస్‌తో పరిశోధనలు, యూత్ ఎక్స్ఛేంజ్ మీద ఒప్పందాలు జరిగే వీలుంది. వీటివల్ల ఆక్వా రంగానికి సాంకేతిక పరిజ్ఞానాన్ని అందివ్వడంతోపాటు భారత్-చైనాలు సంయుక్తంగా పరిశోధనలు చేయవచ్చు. ప్రస్తుతం ఆక్వా రైతాంగం సముద్ర ఉత్పత్తుల పెంపకంలో ఎదుర్కొంటున్న సమస్యలు పరిష్కారానికి నోచుకోనున్నాయ. ముఖ్యంగా ఆక్వా రంగానికి సంబంధించిన కోర్సులు చేస్తున్న వారికి యూత్ ఎక్స్ఛేంజ్ కార్యక్రమాల ద్వారా అవగాహన కల్పిస్తారు. ప్రపంచవ్యాప్తంగా 73.8 మిలియన్ టన్నుల ఆక్వా ఉత్పత్తులు ఉత్పత్తి అవుతుండగా, అందులో 58.7 మిలియన్ టన్నులతో చైనా అగ్రస్థానంలో నిలుస్తోంది. ఇక 14.33 మిలియన్ టన్నులతో ఇండోనేషియా రెండో స్థానంలో, 4.8 మిలియన్ టన్నులతో భారత్ మూడో స్థానంలో ఉన్నాయ. చైనాలో 250 రకాల చేపలను ఉత్పత్తి చేస్తుండగా, భారత్‌లో కేవలం 10 రకాల చేపలను మాత్రమే ఉత్పత్తి చేస్తున్నారు. చైనా నుండి ప్రపంచంలో అన్ని దేశాలకు చేపలు, రొయ్యలు ఎగుమతి అవుతుండగా, భారత్ నుండి కేవలం వనామి రొయ్యలు, అదీ కొన్ని దేశాలకు మాత్రమే ఎగుమతి అవుతున్నాయి. ఇక చైనాలో ఎకరం చెరువులో 45 టన్నుల చేపలు ఉత్పత్తి చేస్తుండగా, భారత్‌లో కేవలం 3 నుండి 4 టన్నులు మాత్రమే ఉత్పత్తి అవుతున్నాయి. చైనా మార్కెటింగ్ విషయానికి వస్తే సుమారు 4 నుండి 5 వేల కిలోమీటర్ల వరకు బతికి ఉన్న చేపలను తరలించడం ప్రత్యేకత. కానీ భారత్‌లో ఈ పరిస్థితులు ఎక్కడాలేవు. అక్వా ఉత్పత్తుల పెంపకంలో జలకాలుష్యం లేకుండా సాగుచేసే పద్ధతులతో చైనా ఆక్వా ఉత్పత్తులకు ప్రపంచవ్యాప్తంగా డిమాండ్ పెరిగింది. సేంద్రీయ పద్ధతిలో సాగుచేయడంతోపాటు తక్కువ ఫీడ్‌తో అత్యధిక దిగుబడులను చైనా రైతాంగం సాధిస్తోంది. దీంతో ఇటువంటి ఎన్నో అంశాలపై అంతర్జాతీయ సదస్సులో చర్చించనున్నట్టు ఆనంద గ్రూప్ ఛైర్మన్ యుకె విశ్వనాథరాజు, కేరళ రాష్ట్ర మత్స్య విశ్వవిద్యాలయం ఉపకులపతి, ఆనంద గ్రూప్ ముఖ్య సలహాదారు డాక్టర్ సి మోహన్‌కుమార్ నాయర్ శుక్రవారం ఇక్కడ చెప్పారు. దేశంలోని వివిధ రాష్ట్రాలకు చెందిన ఆక్వా రైతులు, విదేశాల్లో సాగు చేస్తున్న వారందరినీ ఒకచోటకు తీసుకువచ్చి, ప్రపంచవ్యాప్తంగా ఆక్వా రంగం ఏ స్థాయిలో ఉందో తెలియజెప్పడమే ఈ అంతర్జాతీయ సదస్సు ముఖ్య ఉద్దేశమన్నారు.