బిజినెస్

భారత్‌లో బంగారానికి తగ్గిన డిమాండ్!

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

హైదరాబాద్, ఫిబ్రవరి 3: దేశంలో బంగారానికి డిమాండ్ తగ్గింది. 2015లో 857.2 టన్నుల బంగారానికి డిమాండ్ ఉండగా, 2016లో 675.5 టన్నులకు తగ్గింది. ఈ వివరాలను ప్రపంచ స్వర్ణ మండలి (డబ్ల్యుజిసి) శుక్రవారం ప్రకటించింది. బంగారు ఆభరణాల డిమాండ్ కూడా 2015తో పోల్చితే 2016లో 22.4 శాతానికి తగ్గింది. 662.3 టన్నుల నుంచి 514 టన్నులకు ఆభరణాల డిమాండ్ తగ్గిందని మండలి పేర్కొంది. మరోవైపు ప్రపంచ పసిడి డిమాండ్ నిరుడు 2 శాతం పెరిగింది. 2016లో 4,309 టన్నులకు డిమాండ్ కనిపించింది. 2015లో 4,216 టన్నుల డిమాండ్‌ఉందని డబ్ల్యుజిసి చెప్పింది.