బిజినెస్

హెచ్-1బి వీసాలపై ఆధారపడొద్దు

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

న్యూఢిల్లీ/బెంగళూరు, ఫిబ్రవరి 3: భారతీయ ఐటి రంగాన్ని హెచ్-1బి వీసాలు కుదిపేస్తున్న నేపథ్యంలో అసలు వాటిపై ఆధారపడటాన్ని తగ్గించుకోవాలని ఇన్ఫోసిస్ సహవ్యవస్థాపకుడు, దాని మాజీ చైర్మన్ ఎన్‌ఆర్ నారాయణ మూర్తి అన్నారు. భారతీయ ఐటి సంస్థల ఆదాయంలో విదేశాల నుంచి వచ్చేదే ఎక్కువ. అందులో అమెరికాది అగ్రభాగం. ప్రపంచ ఐటి రంగాన్ని శాసిస్తున్న భారతీయ ఐటి సంస్థల చేతిలోనే అగ్రరాజ్య ఐటి ప్రాజెక్టులూ ఉన్నాయి. దీంతో అక్కడి ప్రాజెక్టుల్లో పనిచేయడానికి భారత ఐటి సంస్థలు తమ సిబ్బందిని హెచ్-1బి వీసాల ద్వారానే ఇక్కడి నుంచి పంపిస్తున్నాయి. అయితే ఇన్నాళ్లూ ఇదంతా సజావుగా సాగగా, ఇప్పుడు అమెరికాకు నూతన అధ్యక్షుడిగా డొనాల్డ్ ట్రంప్ రాకతో వ్యవహారం కాస్తా చెడుతోంది. తాను అధ్యక్షుడినైతే అమెరికాలో పెరుగుతున్న నిరుద్యోగాన్ని తగ్గిస్తానని ఎన్నికల ప్రచారంలో తరచూ చెప్పిన ట్రంప్.. ఇప్పుడు ఆ పనినే చేస్తున్నారు. దాన్ని హెచ్-1బి వీసాలతోనే మొదలుపెట్టగా, ఇప్పుడది భారతీయ ఐటి సంస్థలకు ఆందోళన కలిగిస్తోంది. హెచ్-1బి వీసాల జారీలో నిబంధనలను కఠినతరం చేస్తే, విదేశీ ఉద్యోగుల రాక తగ్గుతుందని, ముఖ్యంగా భారత ఐటి ఉద్యోగులకు చెక్ పెట్టినట్లవుతుందని, తద్వారా తమ దేశంలో నిరుద్యోగులకు ఉద్యోగాలు వస్తాయన్నది ట్రంప్ ఆలోచన. సరిగ్గా దీనే్న సమర్థిస్తూ ఎన్‌డిటివికి ఇచ్చిన ఇంటర్వ్యూలో హెచ్-1బి వీసాల వినియోగాన్ని భారతీయ ఐటి సంస్థలు తప్పక నిలిపివేయాల్సి ఉందన్నారు నారాయణ మూర్తి. భారతీయ ఐటి సంస్థలు.. ఉద్యోగుల విషయంలో బహుళ సంస్కృతిని అలవరుచుకోవాలని సూచించారు. విదేశీ ప్రాజెక్టుల కోసం ఆయా దేశాలకు పెద్ద ఎత్తున స్వదేశీ ఉద్యోగులను పంపించే బదులుగా, అక్కడే స్థానిక ఉద్యోగులపై ఆధారపడటం ఉత్తమమన్నారు. ఇందుకు తగినట్లుగా ఆయా దేశాల యువతకు శిక్షణ ఇస్తే బాగుంటుందని అభిప్రాయపడ్డారు. ‘్భరతీయ సాఫ్ట్‌వేర్ సంస్థలు తప్పక బహుళ జాతి సంస్థలుగా మారాలి. అమెరికా ప్రాజెక్టుల్లో పనిచేసేందుకు అమెరికన్లనే నియమించుకోవాలి. అలాగే కెనడా, బ్రిటన్ ఇలా అన్ని దేశాల్లో నిర్వహించే ప్రాజెక్టులకు అక్కడివారి సేవలనే వాడుకోవాలి. అప్పుడే ఇలాంటి ఇబ్బందులు (హెచ్-1బి వీసాల ఆందోళనలు) ఎదురవ్వవు. అంతేగాక బహుళజాతి సంస్థలుగా మారవచ్చు. కాబట్టి ఇకనైనా హెచ్-1బి వీసాలపై ఆధారపడకుండా తగిన ప్రణాళికతో ముందుకెళ్లాలి.’ అని మూర్తి అన్నారు. విదేశాల్లో కూడా కళాశాలల నుంచే నియామకాలు జరపాలన్నారు. ట్రంప్ ఆంక్షల నేపథ్యంలో బహుళజాతి సంస్థలుగా మారేందుకు భారతీయ ఐటి సంస్థలకు ఓ చక్కని అవశాశం లభించిందని అభిప్రాయపడ్డారు. కాగా, హెచ్-1బి వీసాలకు సంబంధించి అమెరికా నూతన ప్రభుత్వ విధానాలపై స్టాక్ మార్కెట్లు ఎందుకు ఆందోళనలో పడుతున్నాయన్న ప్రశ్నకు బదులిస్తూ అందుకే భారతీయేతర నిపుణుల సేవలనూ భారత ఐటి సంస్థలు వినియోగించుకోవాలని చెబుతున్నానంటూ సమాధానమిచ్చారు. అప్పుడు ఇలాంటి భయాలు ఉండబోవన్నారు. ఐటి తదితర ప్రత్యేక రంగాల్లో విదేశీ ఉద్యోగులను నియమించుకునే వెసులుబాటు అమెరికా సంస్థలకు హెచ్-1బి వీసాల ద్వారా వస్తోంది. దీంతో టెక్నాలజీ సంస్థలు యేటా వేలాది ఉద్యోగులను తీసుకుంటున్నాయి. ఫలితంగా అమెరికా యువత నిరుద్యోగులుగా మారుతోందని ట్రంప్ అంటున్నారు. ఈ క్రమంలోనే కొత్త హెచ్-1బి వీసా సంస్కరణ బిల్లును తెచ్చారు. దీని ప్రకారం హెచ్-1బి వీసాదారులకు కనీసం 1,30,000 డాలర్ల వేతనం ఉండాలి. ప్రస్తుతం ఉన్నదానికి ఇది రెండింతలపైనే. అలాకానిపక్షంలో స్థానిక యువతనే ఉద్యోగులుగా తీసుకుని పనిచేయించుకోవాలి. దీంతో ఇంతింత వేతనాలతో విదేశాలకు తమ ఉద్యోగులను పంపించే కంటే అక్కడివారినే ఉద్యోగాల్లోకి తీసుకుంటే లాభం అని ఐటి సంస్థలు భావిస్తున్నాయి. ఇప్పటికే పలు భారతీయ సంస్థలు ఈ దిశగా ప్రకటనలు కూడా చేస్తున్నాయి. ఈ నిర్ణయాలన్నింటి వెనుక ట్రంప్ ఆశించినది కూడా ఇదే కావడం గమనార్హం. ఇప్పుడు ఎన్‌ఆర్ నారాయణ మూర్తి వంటి ఐటి రంగ దిగ్గజాలూ ట్రంప్ ఆలోచనలకు తగ్గట్లే అభిప్రాయాలు వ్యక్తం చేస్తుండటం విశేషం.

చిత్రం.. ఎన్‌ఆర్ నారాయణ మూర్తి