బిజినెస్

రూ. 45 వేల కోట్లు అందుకుంటాం

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

న్యూఢిల్లీ, ఫిబ్రవరి 4: ఈ ఆర్థిక సంవత్సరం (2016-17) ముగియడానికి రెండు నెలల సమయం కూడా లేనప్పటికీ, ప్రభుత్వరంగ సంస్థల్లో పెట్టుబడుల ఉపసంహరణ ద్వారా 45,000 కోట్ల రూపాయల నిధులను అందుకోగలమన్న విశ్వాసాన్ని కేంద్ర ఆర్థిక శాఖ మంత్రి అరుణ్ జైట్లీ వ్యక్తం చేశారు. ఇప్పటిదాకా ప్రస్తుత ఆర్థిక సంవత్సరంలో ప్రభుత్వరంగ సంస్థల వాటాల అమ్మకం ద్వారా వచ్చిన ఆదాయం దాదాపు 30,000 కోట్ల రూపాయలుగానే ఉంది. ఈ క్రమంలో మార్చి 31లోగా మరో 15,000 కోట్ల రూపాయల నిధులను ఖజానాకు తరలిస్తామన్న ఆశాభావాన్ని శనివారం ఇక్కడ ఓ జాతీయ వార్తా చానెల్‌తో జైట్లీ వెలిబుచ్చారు.
7 శాతం వృద్ధిరేటు సాధిస్తాం
మరోవైపు వచ్చే ఆర్థిక సంవత్సరం (2017-18) దేశ జిడిపి వృద్ధిరేటు 7 శాతంగా నమోదు కాగలదంటూ ఆర్థిక వ్యవహారాల కార్యదర్శి శక్తికాంత దాస్ అంచనా వేశారు. శనివారం ఫిక్కీ కార్యక్రమంలో ఆయన పాల్గొన్నారు.
పన్ను చెల్లింపుదారులపై వేధింపులుండవ్
పన్ను చెల్లింపుదారులను ఎవరూ వేధించబోరని, చట్టాన్ని మీరి ప్రవర్తించబోరని సిబిడిటి చైర్మన్ సుశీల్ చంద్ర శనివారం స్పష్టం చేశారు. అలాంటి భయాలు అక్కర్లేదన్న ఆయన అక్రమ సంస్థల అవినీతి ఆదాయం విలువ నిరుడు 80,000 కోట్ల రూపాయలుగా ఉందన్నారు.