బిజినెస్

ఎఫ్‌ఐపిబి స్థానంలో కొత్త వ్యవస్థ

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

న్యూఢిల్లీ, ఫిబ్రవరి 5: దేశంలో వ్యాపారాన్ని సులభతరం చేసేందుకు ప్రస్తుతం కృషి చేస్తున్న విదేశీ పెట్టుబడుల అభివృద్ధి బోర్డు (ఎఫ్‌ఐపిబి)కు బదులుగా రానున్న రెండు నెలల్లో కొత్త వ్యవస్థను అందుబాటులోకి తీసుకురావాలని ప్రభుత్వం భావిస్తోంది. కేంద్ర ఆర్థిక వ్యవహారాల శాఖ కార్యదర్శి శక్తికాంత దాస్ ఈ విషయాన్ని వెల్లడించారు. వ్యాపారాన్ని సులభతరం చేసే ప్రక్రియ (ఈజ్ ఆఫ్ డూయింగ్ బిజినెస్) మరింత మెరుగుపడేందుకు ఇది దోహదం చేస్తుందని ఆయన తెలిపారు. విదేశీ పెట్టుబడులకు సంబంధించిన 90 శాతం ప్రతిపాదనలను ఆటోమ్యాటిక్ మార్గం ద్వారానే అనుమతించడం జరుగుతోందని, కేవలం 10 శాతం ప్రతిపాదనలు మాత్రమే విదేశీ పెట్టుబడుల అభివృద్ధి బోర్డు పరిశీలనకు వెళ్తుండటంతో దానిని రద్దు చేయబోతున్నామని కేంద్ర ఆర్థిక శాఖ మంత్రి అరుణ్ జైట్లీ 2017-18 సార్వత్రిక బడ్జెట్ ప్రసంగంలో ప్రకటించిన విషయం విదితమే. దీంతో విదేశీ పెట్టుబడుల అభివృద్ధి బోర్డుకు బదులుగా రెండు నెలల్లో సరికొత్త వ్యవస్థను అందుబాటులోకి తీసుకొస్తామని, విదేశీ ప్రత్యక్ష పెట్టుబడులకు అనుమతులను మంజూరు చేసేందుకు ఎఫ్‌ఐపిబికి కల్పించిన అధికారాలను రెగ్యులేటర్లకు, లేదా సంబంధిత మంత్రిత్వ శాఖల విభాగాలకు బదిలీ చేసేందుకు ప్రభుత్వ ఆమోదం అవసరమని పిటిఐ వార్తా సంస్థకు ఇచ్చిన ఇంటర్వ్యూలో శక్తికాంత దాస్ వివరించారు. ఈ అధికారాలను ఏవిధంగా అప్పగించాలి, వీటిని ఎవరు పర్యవేక్షించాలన్న దానిపై ప్రస్తుతం కసరత్తు సాగుతోందని, ఇందుకు సంబంధించిన ప్రణాళిక రెండు నెలల్లోగా ఖరారవుతుందని ఆయన తెలిపారు.