బిజినెస్

ఆర్‌బిఐ భేటీ, కార్పొరేట్ ఫలితాలే కీలకం

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

న్యూఢిల్లీ, ఫిబ్రవరి 5: వచ్చే వారం జరగనున్న రిజర్వ్ బ్యాంక్ ద్రవ్య పరపతి విధానం సమీక్ష,కార్పొరేట్ సంస్థల త్రైమాసిక ఫలితాలు, పారిశ్రామిక ఉత్పత్తి గణాంకాలు ఈ వారం మార్కెట్ తీరును నిర్ణయించనున్నాయని నిపుణులు అభిప్రాయ పడుతున్నారు. ఈ నెల 8న జరిగే ఆర్‌బిఐ ద్రవ్య పరపతి విధానం సమీక్షలో వడ్డీ రేట్లను తగ్గించాలా వద్దా అనే దానిపై ఆర్‌బిఐ మానిటరీ పాలసీ కమిటీ ఒక నిర్ణయం తీసుకోనుంది. ఆర్‌బిఐ ద్రవ్యపరపతి విధానం సమీక్షతో పాటుగా ప్రస్తుతం కొనసాగుతున్న త్రైమాసిక ఫలితాలు సైతం మదుపరుల సెంటిమెంట్‌పై ప్రభావం చూపించనున్నాయని ట్రేడ్ స్మార్ట్ ఆన్‌లైన్ వ్యవస్థాపక డైరెక్టర్ విజయ్ సింఘానియా అభిప్రాయ పడ్డారు. ఈ వారం త్రైమాసిక ఫలితాలు ప్రకటించనున్న సంస్థల్లో టాటా స్టీల్, బిహెచ్‌ఇఎల్, పంజాబ్ నేషనల్ బ్యాంక్, సిప్లా, హీరో మోటోకార్ప్, ఎన్‌టిపిసి, లుపిన్, గెయిల్, మహింద్ర, మహింద్ర, స్టేట్ బ్యాంక్ ఆఫ్ ఇండియా, టాటా పవర్‌లాంటి దిగ్గజాలున్నాయి. మరోవైపు 2016 డిసెంబర్ నెలకు సంబంధించిన పారిశ్రామిక ఉత్పత్తి గణాంకాలు శుక్రవారం వెలువడనున్నాయి.
ఇవన్నీ ఒక ఎత్తయితే అయిదు రాష్ట్రాల్లో జరుగుతున్న అసెంబ్లీ ఎన్నికల తీరుతెన్నులు సైతం మార్కెట్ తీరుతెన్నులను నిర్ణయించనున్నాయని మార్కెట్ వర్గాలు అంటున్నాయి. పంజాబ్, గోవా రాష్ట్రాల్లో పోలింగ్ శనివారం ముగియగా, యుపి, ఉత్తరాఖండ్, మణిపూర్ రాష్ట్రాల అసెంబ్లీ ఎన్నికలు మార్చిదాకా కొనసాగనున్న విషయం తెలిసిందే. ఈ అయిదు రాష్ట్రాల ఫలితాలు మార్చి 2వ వారంలో వెలువడుతాయి. అలాగే ప్రస్తుతం జరుగుతున్న పార్లమెంటు బడ్జెట్ సమావేశాల్లో పరిణామాలు కూడా గమనించాల్సిన అవసరం ఉందని నిపుణులు అంటున్నారు. నోట్ల రద్దు ప్రభావాన్ని అంచనా వేయడానికి మిగతా కంపెనీల త్రైమాసిక ఫలితాలను కూడా జాగ్రత్తగా గమనించాల్సిన అవసరం ఉంది. అయితే ఇప్పుడు దృష్టి అంతా కూడా ఆర్‌బిఐ సమావేశంపైనే ఉంది అని కోటక్ సెక్యూరిటీస్ పిసిజి రిసెర్చ్ సీనియర్ వైస్‌ప్రెసిడెంట్ దిపేన్ షా అభిప్రాయ పడ్డారు. గత వారం బిఎస్‌ఇ సెనె్సక్స్ 358 పాయింట్లు, నేషనల్ స్టాక్ ఎక్స్‌చేంజి సూచీ నిఫ్టీ దాదాపు వందపాయింట్లు లాభపడిన విషయం తెలిసిందే. కంపెనీల లాభాలను బట్టి వాటి షేర్ల ధరలు,సూచీలు ఉండే అవకాశముందని అమ్రపాలి ఆద్య ట్రేడింగ్, ఇనె్వస్టమెంట్ రిసెర్చ విభాగం చీఫ్, డైరెక్టర్ అబ్నిష్ కుమార్ సుధాంశు అంటున్నారు.