బిజినెస్

వడ్డీరేట్లపై ఏమి చేస్తారో?

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

న్యూఢిల్లీ, ఫిబ్రవరి 5: నోట్ల రద్దు తర్వాత బ్యాంకుల వద్ద నిధులు ఇబ్బడిముబ్బడిగా ఉండడం, అలాగే చమురు ధరలు పెరుగుతుండడంతో ద్రవ్యోల్బణంపై దాని ప్రభావం పడే అవకాశం ఉండడంతో రిజర్వ్ బ్యాంక్ వచ్చే వారం జరిగే ద్రవ్య పరపతి విధానం సమీక్షలో కీలక వడ్డీ రేట్లను తగ్గించకపోవచ్చని నిపుణులు అభిప్రాయ పడుతున్నారు. అయితే వరసగా మూడో నెల కూడా సేవా రంగం వృద్ధి రేటు తగ్గిపోయిన దృష్ట్యా ఆర్‌బిఐ తన సమీక్షలో ఈ అంశాన్ని పరిగణనలోకి తీసుకోవచ్చనే అంచనాలు కూడా ఉన్నాయి. 500, వెయ్యి రూపాయల నోట్ల రద్దు తర్వాత బ్యాంకుల్లో భారీ మొత్తంలో డిపాజిట్లు వచ్చి చేరిన దృష్ట్యా బ్యాంకులు గత నెలలో రుణాలపై వడ్డీ రేట్లను దాదాపు 1 శాతం దాకా తగ్గించిన విషయం తెలిసిందే.
నోట్ల రద్దు కారణంగా మందగించిన వృద్ధి రేటును మళ్లీ గాడిలో పెట్టడం కోసం స్వల్పకాలిక రుణ రేటయిన రెపో రేటును తగ్గించాలని బ్యాంకులు, పారిశ్రామిక వర్గాలు గట్టిగా కోరుతున్నప్పటికీ ఈ నెల 8న జరిగే సమావేశంలో ఆర్‌బిఐ గవర్నర్ ఉర్జిత్ పటేల్ నేతృత్వంలోని ఆరుగురు సభ్యుల మానిటరీ పాలసీ కమిటీ (ఎంపిసి)వేచి చూసే ధోరణినే అవలంబించవచ్చని నిపుణులు అంటున్నారు. ముడి చమురు ధరలు పెరుగుతూ ఉండడం, అమెరికా అధ్యక్షుడిగా డొనాల్డ్ ట్రంప్ బాధ్యతలు చేపట్టిన తర్వాత ప్రకటించిన పలు రక్షణాత్మక చర్యలను దృష్టిలో ఉంచుకుని ఈ కమిటీ ఇప్పుడున్న విధానంలో ఎలాంటి మార్పులు చేయకపోవచ్చని నిపుణులు అంటున్నారు. బ్యాంకుల వద్ద పుష్కలంగా నిధులు ఉన్నందున ఆర్‌బిఐ రెపో రేటును 0.25 శాతం తగ్గించే అవకాశం ఉందని బంధన్ బ్యాంక్ చైర్మన్, మేనేజింగ్ డైరెక్టర్ చంద్రశేఖర్ ఘోష్ అభిప్రాయ పడ్డారు. అయితే ఆర్‌బిఐ ఈ నెల 8న జరిగే సమావేశంలో యథాతథ స్థితిని కొనసాగించి, వచ్చే ఆర్థిక సంవత్సరం ప్రథమార్థంలో వడ్డీ రేట్లను తగ్గించవచ్చని పారిశ్రామిక మండలి అయిన ఫిక్కీ అభిప్రాయ పడింది.
2021దాకా కూడా చిల్లర ద్రవ్యోల్బణం 4 శాతంగా(2 శాతం అటూ ఇటుగా) కొనసాగించాలనేది మానిటరీ పాలసీ కమిటీ లక్ష్యం. అయితే కూరగాయలు, తృణధాన్యాల ధరల పెరగడంతో డిసెంబర్ నెలలో వినియోగదారుల ధరల సూచీ ఆధారిత ద్రవ్యోల్బణం 5.61 శాతానికి పెరిగిపోవడంతో ఆర్‌బిఐకి వడ్డీ రేట్లను తగ్గించేందుకు అవకాశాలు తగ్గిపోయాయి. టోకు ధరల ఆధారిత ద్రవ్యోల్బణం డిసెంబర్ నెలలో 0.73 శాతం మేర తగ్గినప్పటికీ గత ఏడాది కాలంలో అతితక్కువ తగ్గుదల ఇదే కావడం గమనార్హం.
కాగా ఆర్‌బిఐ ద్రవ్య పరపతి విధానంలో సడలింపులు చేయడానికి స్థూల ఆర్థిక సంకేతాలు అనుకూలంగా ఉన్నాయని కొంతమంది బ్యాంకర్లు అభిప్రాయ పడుతున్నారు. ద్రవ్యోల్బణం, ఆర్థిక లోటు లాంటి ఆర్థిక రంగానికి చెందిన కీలక అంశాలు వడ్డీ రేట్లను తగ్గించడానికి అనుకూలంగా ఉన్నందున రెపో రేటులో 0.25 శాతం తగ్గింపు ఉండవచ్చని తాము భావిస్తున్నామని బ్యాంక్ ఆఫ్ మహారాష్ట్ర ఎగ్జిక్యూటివ్ డైరెక్టర్ ఆర్‌కె గుప్తా అభిప్రాయ పడ్డారు. అభివృద్ధికి దోహదపడే బడ్జెట్‌ను సమర్పించిన దృష్ట్యా ఆర్‌బిఐ కూడా అదే స్ఫూర్తితో స్పందిస్తుందని అందరూ భావిస్తున్నారని కూడా ఆయన అన్నారు. బ్యాంకింగ్ వ్యవస్థలో ద్రవ్య లభ్యత (లిక్విడిటీ) అవసరానికి మించి ఉన్న కారణంగా రెపో రేటులో 25 బేసిస్ పాయింట్లు తగ్గించవచ్చన్న అంచనాలు ఉన్నాయని యుకో బ్యాంక్ ఎండి, సిఈఓ ఆర్‌కె టక్కర్ అభిప్రాయ పడ్డారు. ఆయితే ఆర్‌బిఐ ఈ నెల 8న రెపో రేటును 25 బేసిస్ పాయింట్లు తగ్గించిన తర్వాత ఈ ఏడాది అంతా వడ్డీ రేట్లను యథాతథంగా కొనసాగించే అవకాశముందని జపాన్‌కు చెందిన ఆర్థిక సేవల దిగ్గజం నోమురా అభిప్రాయ పడింది. కాగా, నోట్ల రద్దు కారణంగా దేశ ఆర్థిక రంగానికి విప్లవాత్మకమైన ప్రయోజనాలు లభించిన దృష్ట్యా బ్యాంకులు ఆ ప్రయోజనాన్ని కస్టమర్లకు అందించాలంటే ఆర్‌బిఐ 0.75 శాతం దాకా వడ్డీ రేట్లను తగ్గించాలని అసోచామ్ అభిప్రాయ పడింది.

చిత్రం..ఆర్‌బిఐ గవర్నర్ ఉర్జిత్ పటేల్