బిజినెస్

రికార్డు స్థాయిలో బెల్లం ధరలు

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

అనకాపల్లి, ఫిబ్రవరి 6: దేశంలోనే బెల్లానికి ప్రసిద్ధిగాంచిన విశాఖ జిల్లా అనకాపల్లి మార్కెట్‌లో రికార్డు స్థాయిలో బెల్లం ధరలు పలికాయి. పది కిలోల మంచి రంగు బెల్లానికి 405 రూపాయల వరకు ధర వచ్చింది. ఈ ధర మార్కెట్ చరిత్రలో ఏనాడూ తాము చూడలేదని అటు వ్యాపారులు, ఇటు రైతులు అంటున్నారు.
ఎవరూ ఊహించని, ఆశించని విధంగా నాసిరకం నలుపు రంగు బెల్లానికి కూడా అనూహ్య రీతిలో ధర రావడం విశేషం. పది కిలోల నల్ల బెల్లం ధర 365 నుండి 375 రూపాయల వరకు పలికింది. సాధారణంగా ఇక్కడి మార్కెట్‌లో మంచి రంగు బెల్లానికి, నలుపు రంగు బెల్లానికి వంద రూపాయల వరకు ధరలో వ్యత్యాసముండేది. కానీ ప్రస్తుతం 30 రూపాయలకు మించి ధరలో వ్యత్యాసం ఉండకపోవడం గమనార్హం.
దేశంలోని ఇతర సుదూర ప్రాంతాలకు చెందిన బెల్లం వ్యాపారులు ఇక్కడి మార్కెట్‌కు వచ్చి బెల్లాన్ని కొనుగోలుచేసి అన్‌సీజన్‌లో అమ్మేందుకు నిల్వలు వేసేందుకు పోటీపడుతుండటమే ధరలు రికార్డు స్థాయిలో పలకడానికి ప్రధాన కారణం. సాధారణంగా స్థానిక వ్యాపారులు సీజన్‌లో బెల్లాన్ని కొని అన్‌సీజన్‌లో విక్రయించేవారు. ఆ విధంగా గతంలో నిల్వలు వేసిన వ్యాపారులు అన్‌సీజన్‌లో సైతం ధరలు పడిపోవడంతో అపారనష్టాలను చవిచూసారు. దీంతో ఈ ఏడాది స్థానిక వ్యాపారులు బెల్లం నిల్వలు వేసేందుకు ముందుకు రాలేదు. అయితే ఇతర ప్రాంతాలకు చెందిన వ్యాపారులు ఇక్కడి మార్కెట్‌లో బెల్లం కొని నిల్వలు వేసేందుకు పోటీపడుతున్నారు. ఇక్కడి బెల్లం ఒడిశా, చత్తీస్‌ఘడ్, రాంచీ, మహారాష్ట్ర తదితర రాష్ట్రాల్లోని ప్రాంతాలకు ఎగుమతి అవుతుంటుంది. కానీ ప్రస్తుతం ఇతర ప్రాంతాలకు ఎగుమతి అయ్యే బెల్లం కంటే నిల్వలు వేసేందుకే ఎక్కువగా కొనుగోలు చేస్తున్నారు. ప్రస్తుతం మార్కెట్‌కు 12 నుండి 16 వేల దిమ్మల వరకు బెల్లం వస్తోంది.
మరో నెలరోజుల వరకు ఇక్కడి మార్కెట్‌కు వచ్చే బెల్లం ఇదే విధంగా రావచ్చని అంచనా వేస్తున్నారు. తరువాత క్రమేపీ తగ్గిపోనుంది. వరుసగా రెండేళ్లపాటు బెల్లం ధరలు నిరాశాజనకంగా ఉండటంతో చెరకు రైతులు నష్టాలను చవిచూసారు. దీంతో చెరకు సాగుకు స్వస్తి పలికి ప్రత్యామ్నాయంగా ఇతర పంటల సాగుపై దృష్టి కేంద్రీకరించారు. అయతే తాజా ధరలతో తిరిగి చెరకు సాగు పట్ల రైతులు ఆసక్తి కనబరుస్తున్నారు.
కాగా, వరుస విపత్తులు, నిరాశాజనక ధరలతో బెల్లం మార్కెట్ ఉనికిపైనే ఆశలు కోల్పోయిన వ్యాపారులు.. తిరిగి మార్కెట్ పూర్వ వైభవం సంతరించుకుంటోందని ఆనందం వ్యక్తం చేస్తున్నారు. మొత్తానికి ప్రస్తుతం పలుకుతున్న బెల్లం ధరలు ఇదే విధంగా నిలకడగా ఉంటే చెరకు రైతులకు కాసుల వర్షం కురిసినట్లే. మరోవైపు బెల్లం ధరలు పెరిగితే, చక్కెర ధరలకూ రెక్కలొస్తాయంటున్న అభిప్రా యాలూ వ్యక్తమవుతున్నాయ.