బిజినెస్

పురోగమిస్తున్న పారిశ్రామిక రంగం

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

కాకినాడ, ఫిబ్రవరి 6: తూర్పు గోదావరి జిల్లా ప్రస్తుతం పారిశ్రామికంగా పురోగమిస్తోంది. రానున్న రెండు, మూడేళ్లలో జిల్లా పారిశ్రామిక రంగం లో మంచి ఫలితాలను సాధించే అవకాశాలున్నట్టు అధికారిక వర్గాలు అంచనా వేస్తున్నాయి. జిల్లాలో పారిశ్రామిక ప్రగతిని దృష్టిలో ఉంచుకుని పోర్టులు, ఎయిర్‌పోర్టుల అభివృద్ధికి కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాలు సన్నాహాలు ప్రారంభించాయి. విశాఖ-చెన్నై కోస్టల్ కారిడార్‌లో భాగంగా తూర్పు గోదావరి జిల్లాలో ఇండస్ట్రియల్ కారిడార్ ఏర్పాటుకు తీర ప్రాంతంలో రహదారుల అభివృద్ధి పనులు జరుగుతున్నాయి. కాకినాడ తీరంలో ప్రభుత్వ ఆధీనంలోగల యాంకరేజి పోర్టు, ప్రైవేటు సంస్థ కాకినాడ సీపోర్ట్స్‌కు చెందిన డీప్ వాటర్ పోర్టుల అభివృద్ధి పనులు జరుగుతున్నాయి. గత సంవత్సరం యాంకరేజి పోర్టు ద్వారా 15 లక్షల మెట్రిక్ టన్నులు, డీప్ వాటర్ పోర్టు ద్వారా 89 లక్షల మెట్రిక్ టన్నుల సరకు రవాణా నిర్వహించి, 287 కోట్ల రూపాయల ఆదాయాన్ని ఆర్జించారు. డీప్ వాటర్ పోర్టు విస్తరణలో భాగంగా 7వ బెర్త్ నిర్మాణం ఇటీవల పూర్తవగా, యాంకకరేజి పోర్టుకు వెళ్ళే రహదారుల అభివృద్ధికి 10 కోట్ల రూపాయలు కేటాయించారు. యాం కరేజి పోర్టు వద్ద కంటైనర్ డిపోను నెలకొల్పడానికి కంటైనర్ కార్పొరేషన్‌కు అవసరమైన భూమిని ప్రభుత్వం కేటాయించింది. భవిష్యత్ పారిశ్రామిక అవసరాలను దృష్టిలో ఉంచుకుని కాకినాడ పోర్టులో మరో జెట్టీని నిర్మిస్తున్నారు. అలాగే రాజమహేంద్రవరం ఎయిర్‌పోర్టు విస్తరణ పనులు చురుగ్గా సాగుతున్నాయి. ఇందుకు 857 ఎకరాల స్థలాన్ని సేకరించి ఎయిర్‌పోర్ట్స్ అథారిటీకి ఇప్పటికే ప్రభుత్వం అప్పగించింది. ప్రస్తుతం ఉన్న 1,750 మీటర్ల రన్‌వేను 3,165 మీటర్లకు విస్తరించడం ద్వారా ఎ-320 బోయింగ్, 739 వంటి భారీ విమానాల రాకపోకలను ఇక్కడి నుంచే సాగించడానికి సన్నాహాలు చేస్తున్నారు. విశాఖ-చెన్నై కోస్టల్ కారిడార్‌లో భాగంగా తూర్పు గోదావరి జిల్లాలో కాకినాడ-రాజానగరం రోడ్డు, వాకలపూడి-ఈదటం రహదారులను నాలుగు లేన్లుగా అభివృద్ధి చేయడానికి పను లు ప్రారంభమయ్యాయి. పారిశ్రామిక ప్రగతిలో భాగంగా చిన్న, మధ్యతరహా పరిశ్రమల ప్రోత్సాహానికి సింగిల్ విండో విధానాన్ని అమలుచేస్తున్నారు. సింగిల్ డెస్క్ విధానంలో గత సంవత్సరం 1,244 పరిశ్రమల స్థాపనకు ఆన్‌లైన్ విధానంలో అనుమతులు జారీచేశారు. పరిశ్రమల ప్రోత్సాహం కింద రాయితీలు కల్పిస్తూ పెట్టుబడులను ఆహ్వానించాలని ప్రభుత్వం ఆయా శాఖల అధికారులకు ఆదేశాలు జారీచేసింది.