బిజినెస్

ఎల్‌ఐసి ఏజంట్ల గ్రాట్యుటీ రూ. 3 లక్షలకు పెంపు

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

ముంబయి, ఫిబ్రవరి 6: జీవిత బీమా సంస్థ (ఎల్‌ఐసి)లో ఏజంట్లు పెద్ద ఎత్తున మానివేస్తుండడంతో దీనికి అడ్డుకట్ట వేయడంతోపాటుగా వారు మరింత ఎక్కువ వ్యాపారం చేసేలా చూడడం కోసం ఆ సంస్థ దేశవ్యాప్తంగా ఉన్న పది లక్షలకుపైగా ఏజంట్లకు చెల్లించే గ్రాట్యుటీని 3 లక్షల రూపాయలకు పెంచింది. ప్రభుత్వరంగ బీమా సంస్థ అయిన ఎల్‌ఐసికి వచ్చే ప్రీమియం ఆదాయంలో దాదాపు 94 శాతం దేశవ్యాప్తంగా ఉండే సుమారు 11 లక్షల మంది ఏజంట్ల ద్వారానే వస్తుంది.
అదే ప్రైవేట్ రంగంలోని బీమా సంస్థల వ్యాపారంలో దాదాపు 50 శాతం మాత్రమే ఏజన్సీ మార్గంలో జరుగుతోంది. గత ఆర్థిక సంవత్సరం (2015-16)లో జీవిత బీమా సంస్థ దాదాపు 2.45 లక్షల మంది ఏజంట్లను రిక్రూట్ చేసుకుంది. అయితే అదే సమయంలో 3.40 లక్షల మంది ఏజంట్లను తొలగించడమో లేదా వారే స్వచ్ఛందంగా వైదొలగడమో జరిగింది. 2016 మార్చి నాటికి ఎల్‌ఐసిలో 10.60 లక్షల మంది ఏజంట్లు ఉండగా, ఈ ఏడాది జనవరి చివరి నాటికి ఇది 11.05 లక్షలకు పెరిగింది. అంటే ఏడాది మొత్తంమీద 45వేల మంది కొత్త ఏజంట్లను చేర్చుకున్నట్లు ఎల్‌ఐసి అధికారి ఒకరు చెప్పారు. కాగా, ఏజంట్లకు చెల్లించే గ్రాట్యుటీ తొలి 15 అర్హతా సంవత్సరాలకు ప్రతి సంవత్సరానికి చెల్లించే అర్హతా రేటు ప్రకారం, ఆ తర్వాతి పది సంవత్సరాలకు అర్హతా రేటులో సగం ఉంటుందని, అయితే ఈ మొత్తం గరిష్ఠంగా 3 లక్షల రూపాయలకు మించకుండా ఉంటుందని గజిట్ నోటిఫికేషన్ పేర్కొంటోంది. ఇప్పుడున్న నిబంధనల ప్రకారం ఒక ఏజంట్ 15 ఏళ్ల తర్వాత సర్వీస్ నుంచి వైదొలగితే 2 లక్షల రూపాయలు గ్రాట్యుటీగా లభిస్తుంది. సగటున ఒక ఏజంట్‌కు విక్రయించిన ప్రీమియంలో 35 శాతం, సింగిల్ ప్రీమియం పాలసీలపైన విక్రయించిన ప్రీమియంలో 2 శాతం కమిషన్‌గా లభిస్తుంది. మొత్తానికి జారిపోతున్న ఏజంట్ బలాన్ని ఒడిసి పట్టుకోవాలని చూస్తోందిప్పుడు ఎల్‌ఐసి.