బిజినెస్

పౌర సరఫరాల శాఖకు కందిపప్పు దెబ్బ!

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

హైదరాబాద్, ఫిబ్రవరి 7: పౌర సరఫరాల శాఖ గోదాముల్లో వృథాగా పడిఉన్న కోట్లాది రూపాయల నిల్వలపై ప్రభుత్వం దృష్టి సారించింది. అవసరం లేకుండా గోదాముల్లో ఉన్న ఆహార ధాన్యాన్ని విక్రయించాలని నిర్ణయించింది. వృథా నిల్వలతో గోదాముల్లో స్థలం సమస్యగా మారడంతోపాటు నిత్యావసరాల నాణ్యత దెబ్బతింటోంది. దీంతో వృథాగా ఉన్న నిల్వలను తొలగించాలని అధికారులు నిర్ణయించారు. నిరుడు మే నెలలో పౌర సరఫరాల శాఖ కందులను కొనుగోలు చేసింది. కందులను మిల్లింగ్ చేయించి, కందిపప్పును కోనుగోలు చేసే విధంగా రాష్ట్ర దాల్ మిల్లర్ల సంఘం ప్రతినిధులతో చర్చలు జరపాలని నిర్ణయించారు. వీటి విక్రయం ద్వారా పౌర సరఫరాల సంస్థ ఖజానాకు ఏడున్నర కోట్ల రూపాయలు వస్తాయని ఆ శాఖ కమిషనర్ సివి ఆనంద్ తెలిపారు. నిరుడు మార్కెట్‌లో కందిపప్పు ధర కిలో 150 నుండి 170 వరకు పలకడంతో కిలో 120 రూపాయలకు అందించాలనే ఉద్దేశంతో కేంద్ర ప్రభుత్వం నుండి క్వింటాలుకు 6,930 రూపాయల చొప్పున రెండు వేల మెట్రిక్ టన్నుల కందులను కొనుగోలు చేశారు. అయతే అనంతర కాలంలో బహిరంగ మార్కెట్‌లో కందిపప్పు ధర పడిపోయింది. రైతు బజార్లలో కేవలం 11 టన్నులను మాత్రమే అమ్మారు. తర్వాత మార్కెట్ ధర ఇంకా తగ్గడంతో ఐసిడిఎస్ కూడా ముందుకు రాలేదు. దీంత పౌర సరఫరాల శాఖ సంస్థ దగ్గర 134 మెట్రిక్ టన్నుల కందిపప్పుతో పాటు 1500 మెట్రిక్ టన్నుల కందులు అలానే మిగిలిపోయాయి. దీంతో వీటిపై దృష్టిసారించి, విక్రయించాలని నిర్ణయించారు. టెండర్లు పిలిస్తే ఒకే ఒక్క టెండర్ దాఖలైంది. పాత కందిపప్పు, కందులు కొనేందుకు ఎవరూ ముందుకు రావడం లేదు. సామాజిక బాధ్యతగా తీసుకోవాలని పౌర సరఫరాల శాఖ దాల్ మిల్లర్లను కోరడంతో వారు ముందుకు వచ్చారని ఆనంద్ తెలిపారు. క్వింటాల్ 3,300 రూపాయల ధరతో 493 మెట్రిక్ టన్నులు, క్వింటాల్ 3,100 రూపాయల చొప్పున 1,008 మెట్రిక్ టన్నుల కందులను, 134 మెట్రిక్ టన్నుల కందిపప్పును క్వింటాల్‌కు 4,100 రూపాయల చొప్పున కొనుగోలు చేసేందుకు దాల్ మిల్లర్లు అంగీకరించారని చెప్పారు.
సంస్థ 15.54 కోట్ల రూపాయలతో రెండు వేల మెట్రిక్ టన్నుల కందులు కొనుగోలు చేయగా, ఇప్పడు వాటిని అమ్మడం ద్వారా 7.50 కోట్ల రూపాయలు మాత్రమే వస్తున్నాయని చెప్పారు. పర్యవేక్షణ, మార్కెటింగ్ విధానం సరిగా లేకపోవడం, వీటికితోడు బహిరంగ మార్కెట్‌లో కందిపప్పు ధరలు భారీగా పడిపోవడం వల్ల సంస్థకు 8.04 కోట్ల రూపాయల నష్టం వాటిల్లుతోందని కమిషనర్ ఆనంద్ తెలిపారు. అయతే సకాలంలో స్పందించడం వల్ల నష్టాన్ని కొంత వరకు తగ్గించామని చెప్పారు. అలస్యం చేస్తే వంద శాతం నష్టం కలుగుతుందనే ఉద్దేశంతోనే కందులు కొనుగోలు చేసేందుకు దాల్ మిల్లర్లను సంప్రదించినట్లు తెలిపారు.