బిజినెస్

వరుస లాభాలకు బ్రేక్

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

ముంబయి, ఫిబ్రవరి 7: వరుస నాలుగు రోజుల లాభాలకు బ్రేక్‌వేస్తూ దేశీయ స్టాక్ మార్కెట్లు మంగళవారం నష్టాల్లో ముగిశాయి. బాంబే స్టాక్ ఎక్స్‌చేంజ్ సూచీ సెనె్సక్స్ 104.12 పాయింట్లు పడిపోయి 28,335.16 వద్ద స్థిరపడితే, నేషనల్ స్టాక్ ఎక్స్‌చేంజ్ సూచీ నిఫ్టీ 32.75 పాయింట్లు దిగజారి 8,768.30 వద్ద నిలిచింది. బుధవారం రిజర్వ్ బ్యాంక్ ఆఫ్ ఇండియా (ఆర్‌బిఐ) ద్రవ్యసమీక్ష జరగనున్న క్రమంలో బ్యాంకింగ్, రియల్టీ షేర్లు అమ్మకాల ఒత్తిడికి లోనయ్యాయి. అంతర్జాతీయ మార్కెట్‌లో ముడి చమురు ధరల పెరుగుదల, రాబోయే ఫ్రెంచ్ ఎన్నికలు, డొనాల్డ్ ట్రంప్ నాయకత్వంలో అమెరికా విధానాలు వంటివి కూడా మదుపరులను ఆందోళనకు గురిచేశాయి. దీంతోనే నష్టాలు తప్పలేదని మార్కెట్ నిపుణులు ట్రేడింగ్ సరళిని విశే్లషిస్తున్నారు. ఇక ఆసియా మార్కెట్లలో కీలక మార్కెట్లైన చైనా, జపాన్, హాంకాంగ్ సూచీలు నష్టాల్లో ముగియగా, ఐరోపా మార్కెట్లలోనూ ప్రధాన సూచీలైన ఫ్రాన్స్, జర్మనీ, బ్రిటన్ మార్కెట్లు నష్టాల్లోనే కదలాడాయి.