బిజినెస్

ఐటిసిలో తగ్గిన ప్రభుత్వ వాటా

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

న్యూఢిల్లీ, ఫిబ్రవరి 7: బహుళ వ్యాపార దిగ్గజం ఐటిసిలో 2 శాతం వాటా విక్రయం ద్వారా 6,700 కోట్ల రూపాయల నిధులను మంగళవారం అందుకుంది కేంద్ర ప్రభుత్వం. ప్రభుత్వరంగ సంస్థ స్పెసిఫైడ్ అండర్‌టేకింగ్ ఆఫ్ ది యూనిట్ ట్రస్ట్ ఆఫ్ ఇండియా (ఎస్‌యుయుటిఐ) ద్వారా ఈ వాటాను ప్రభుత్వం అమ్మేయగా, ఒక్కో షేర్‌ను 275.85 రూపాయల చొప్పున మొత్తం వాటాను ప్రభుత్వరంగ బీమా సంస్థ ఎల్‌ఐసి కొనుగోలు చేసింది. కాగా, ఐటిసిలో ఎస్‌యుయుటిఐకి 11.17 శాతం వాటా ఉండగా, తాజా అమ్మకంతో 9.17 శాతానికి పడిపోయింది.