బిజినెస్

స్టాక్ మార్కెట్లకు స్వల్ప లాభాలు

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

ముంబయి, ఫిబ్రవరి 9: మార్కెట్లకు ఊతమిచ్చే తాజా సంకేతాలేవీ లేని నేపథ్యంలో దేశీయ స్టాక్ మార్కెట్లు గురువారం రోజంతా హెచ్చుతగ్గులకు గురవుతూ చివరికి స్వల్ప లాభాలతో ముగిశాయి. ఆర్‌బిఐ ద్రవ్యపరపతి విదానంలో వడ్డీ రేట్లను యథాతథంగా కొనసాగించిన నేపథ్యంలో మదుపరులు శుక్రవారం వెలువడబోయే పారిశ్రామిక ఉత్పత్తి గణాంకాలు, ఈ వారంలో ప్రకటించబోయే కార్పొరేట్ ఫలితాలపై ఆశావహ దృక్పథంతో కొనుగోళ్లపై దృష్టిపెట్టారు. నిన్నటి ముగింపుకన్నా పైస్థాయిలో ప్రారంభమైన సెనె్సక్స్ ఆ తర్వాత 28,469.48-28,152.18 పాయింట్ల మధ్య ఊగిసలాడుతూ చివరికి 39.78 పాయింట్ల లాభంతో 28,329.70 పాయింట్ల వద్ద ముగిసింది. నేషనల్ స్టాక్ ఎక్స్‌చేంజి సూచీ నిఫ్టీ సైతం అదే తీరులో కొనసాగి 9.35 పాయింట్ల స్వల్ప లాభంతో 8,77840 పాయింట్ల వద్ద ముగిసింది. ఆసియా మార్కెట్లలో నిలకడ ధోరణి, ఐరోపా మార్కెట్లు మెరుగైన ధోరణిలో ప్రారంభం కావడం కూడా మార్కెట్‌పై సానుకూల ప్రభావం చూపించింది. డాలరుతో రూపాయి బలపడుతూ ఉండడం కూడా ఇందుకు దోహదపడింది. సెనె్సక్స్‌లోని 30 కంపెనీల షేర్లలో టిసిఎస్ అత్యధికంగా లాభపడగా, భారతీ ఎయిర్‌టెల్ రెండో స్థానంలో నిలిచింది. ఇన్ఫోసిస్, గెయిల్, విప్రో, ఐటిసి, రిల్, ఎంఅండ్‌ఎం, పవర్‌గ్రిడ్, ఏసియన్ పెయింట్స్, అదానీ పోర్ట్స్, కోల్ ఇండియా లాంటి షేర్లు కూడా మంచి లాభాలను ఆర్జించాయి. అయితే బ్యాంకింగ్ షేర్లు నష్టపోవడంతో సెనె్సక్స్ లాభాలు పరిమితంగానే మిగిలాయి. ప్రధాన ఆసియా మార్కెట్ల సూచీలు సైతం లాభాలతో ముగిశాయి.