బిజినెస్

స్వల్ప లాభాల్లో దేశీయ స్టాక్ మార్కెట్లు

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

ముంబయి, ఫిబ్రవరి 10: దేశీయ స్టాక్ మార్కెట్లు శుక్రవారం స్వల్ప లాభాల్లో ముగిశాయి. బాంబే స్టాక్ ఎక్స్‌చేంజ్ సూచీ సెనె్సక్స్ 4.55 పాయింట్లు పెరిగి 28,334.25 వద్ద స్థిరపడితే, నేషనల్ స్టాక్ ఎక్స్‌చేంజ్ సూచీ నిఫ్టీ 15.15 పాయింట్లు అందుకుని 8,793.55 వద్ద స్థిరపడింది. అంతర్జాతీయ మార్కెట్ల సానుకూల సంకేతాలు దేశీయ మార్కెట్లపై పెద్దగా ప్రభావం చూపలేకపోయాయి. కాగా, ఐటి, టెక్నాలజీ, క్యాపిటల్ గూడ్స్, బ్యాంకింగ్, పవర్ షేర్లు లాభాలను అందుకున్నాయి. ఆసియా మార్కెట్లలో కీలక సూచీలైన జపాన్, హాంకాంగ్, చైనాలు లాభాల్లో ముగియగా, ఐరోపా మార్కెట్లలోనూ ప్రధాన సూచీలైన జర్మనీ, బ్రిటన్, ఫ్రాన్స్‌లు లాభాల్లో కదలాడాయి.