బిజినెస్

ఐఐపికి నోట్ల రద్దు దెబ్బ

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

న్యూఢిల్లీ, ఫిబ్రవరి 10: పాత పెద్ద నోట్ల రద్దు ప్రభావం దేశీయ పారిశ్రామికోత్పత్తిపై పడింది. నిరుడు డిసెంబర్‌లో పారిశ్రామికోత్పత్తి సూచీ (ఐఐపి) మైనస్ 0.4 శాతంగా నమోదైంది. అయితే అంతకుముందు ఏడాది ఇది మైనస్ 0.9 శాతంగా ఉన్నప్పటికీ, కీలకమైన తయారీ రంగంలో నెలకొన్న మందగమనం ఐఐపిని కోలుకోలేకుండా చేసింది. దీంతో గనులు, విద్యుత్ రంగాలు చెప్పుకోదగ్గ వృద్ధినే అందుకున్నప్పటికీ ఫలితం లేకపోయింది. మరోవైపు నిరుడు నవంబర్ 8న తీసుకున్న పాత 500, 1,000 రూపాయల నోట్ల రద్దు నిర్ణయం వల్లే ఐఐపి క్షీణించిందని కేంద్ర ఆర్థిక మంత్రిత్వ శాఖ అంగీకరించింది. రాబోయే నెలల్లో ఇది కోలుకుంటుందన్న విశ్వాసాన్ని వ్యక్తం చేసింది.