బిజినెస్

కంటైనర్ కార్గో రవాణాకు ఉజ్వల భవిష్యత్

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

విశాఖపట్నం, ఫిబ్రవరి 10: కంటైనర్ కార్గో రవాణాకు ఉజ్వల భవిష్యత్ ఉందని కాంకర్ చైర్మన్, మేనేజింగ్ డైరక్టర్ (సిఎండి) కళ్యాణ్ రామ్ అన్నారు. మారిటైం గేట్‌వే, ఎర్నెస్ట్ అండ్ యంగ్, ఆంధ్రప్రదేశ్ ఛాంబర్ ఆఫ్ కామర్స్ సంయుక్తంగా ఐదవ ఈస్ట్‌కోస్ట్ మారిటైం సమ్మిట్‌ను విశాఖలో నిర్వహించాయ. గురువారం ప్రారంభమైన ఈ సమ్మిట్‌లో సముద్ర జల రవాణాలో కీలక పాత్ర పోషిస్తున్న వివిధ సంస్థల అధినేతలు వివిధ అంశాలపై చర్చిస్తున్నారు. శుక్రవారం బంగ్లాదేశ్, శ్రీలంక, సింగపూర్, మయన్మార్, దుబాయ్‌కు చెందిన ప్రతినిధులు హాజరయ్యారు. ఈ సమ్మిట్‌లో కళ్యాణ్ రామ్ మాట్లాడుతూ ప్రపంచ మార్కెట్ ప్రతికూల పరిస్థితుల్లో నడుస్తోందన్నారు. కంటైనర్ కార్గో ఎగుమతి, దిగుమతుల్లో చైనా ప్రథమ స్థానంలో ఉందని, కంటైనర్ల ద్వారా అధిక మొత్తంలో కార్గోను రవాణా చేయడానికి వీలుందని చెప్పారు. ప్రైవేటు పోర్టులు కంటైనర్ కార్గోను పెద్ద ఎత్తున ప్రోత్సహిస్తున్నాయన్న ఆయన ఇప్పటికే విశాఖలో 450 కోట్ల రూపాయలతో తమ సంస్థ మల్టీ మోడల్ లాజిస్టిక్ పార్క్ (ఎంఎంఎల్‌పి)ని ఏర్పాటు చేసిందని, శుక్రవారం దాని ట్రయల్ రన్ ప్రారంభమైందని చెప్పారు. త్వరలోనే కృష్ణపట్నం, కాకినాడ, కోల్‌కతా, బాలాసోర్, పారదీప్ పోర్టుల్లో కూడా ఎంఎంఎల్‌పిలను ఏర్పాటు చేయనున్నామని ఆయన తెలియచేశారు. మారిటైం గెట్‌వే పబ్లికేషన్ డైరెక్టర్ రామ్ ప్రసాద్ మాట్లాడుతూ 696 మిలియన్ టన్నుల కార్గో హ్యాండిల్ చేసే పోర్టులు ఉన్నప్పటికీ, ప్రతికూల పరిస్థితుల దృష్ట్యా 393 మిలియన్ టన్నులను మాత్రమే హ్యాండిల్ చేయగలిగామని ఆయన చెప్పారు. ఐరన్ ఓర్ రవాణా చాలా వరకూ తగ్గిపోయిందని, కోల్ కూడా అదే బాటలో ఉందని ఆయ న తెలియచేశారు. కాగా, నిరుడు ఏప్రిల్ నుంచి డిసెంబర్ వరకు కార్గో రవాణాలో కేవలం 4.28 శాతం మాత్రమే వృద్ధి సాధించామని చెప్పారు. దేశంలో పారదీప్, విశాఖ పోర్టు ట్రస్ట్ పరిస్థితి కొంత ఆశాజనకంగా ఉందన్నారు. కంటైనర్ కార్గో రవాణా సత్ఫలితాలను ఇస్తున్నాయని, ఏ పోర్టుకైనా రోడ్, రైల్ కనెక్టివిటీ చాలా ముఖ్యమని, దీనిపై ప్రభుత్వాలు దృష్టి కేంద్రీకరించాలని సూచించారు. అలాగే వౌలిక సదుపాయాలకు అధిక ప్రాధాన్యత ఇవ్వాలని, విశాఖ-చెన్నై, బెంగళూరు-చెన్నై ఇండస్ట్రియల్ కారిడార్ అందుబాటులోకి వస్తే, పోర్టుల్లో ట్రాఫిక్ పెరుగుతుందని రామ్ ప్రసాద్ వివరించారు. ఈ సదస్సుకు విశాఖపట్నం పోర్టు ట్రస్ట్ చైర్మన్ కృష్ణబాబు, కృష్ణపట్నం, గంగవరం పోర్టు ప్రతినిధులు హాజరయ్యారు.